Guntur Kaaram Tickets: హైదరాబాద్ లో గుంటూరు కారంకు రికార్డ్ బుకింగ్స్.. బాక్సాఫీస్ షేక్ అయ్యేలా?

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ మరో 36 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం షోలు మొదలుకానున్నాయి. తెలంగాణలో గుంటూరు కారం సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు ఆరు షోలకు అనుమతులు రావడం ప్లస్ అయింది. హైదరాబాద్ లో ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా టికెట్స్ భారీ రేంజ్ లో బుక్ అవుతుండటం గమనార్హం.

మల్టీప్లెక్స్ లలో, సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమా బుకింగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్ డ్రామా కథాంశంతో గుంటూరు కారం తెరకెక్కగా ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గుంటూరు కారం మూవీ ఫస్ట్ డే కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి సక్సెస్ రేట్ ను మరింత పెంచాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం మూవీకి బుకింగ్స్ విషయంలో వస్తున్న రెస్పాన్స్ విషయంలో అభిమానులు సంతోషంగా ఉన్నారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా మహేష్ బాబు ఇచ్చిన స్పీచ్ నెట్టింట వైరల్ అవుతోంది.

అభిమానులకు మహేష్ బాబు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో ఆ స్పీచ్ ను బట్టి అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గుంటూరు కారం (Guntur Kaaram) మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఫస్ట్ వీక్ కే కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus