సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్రేజీ సినిమాలు వచ్చాయి. ఇందులో ‘అతడు’ సినిమా థియేటర్లలో బాగానే ఆడింది కానీ ‘ఖలేజా’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. కానీ ఆ సినిమాని టీవీల్లో కొంత మంది ప్రేక్షకులు బాగా చూశారు. దీనికి కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారని చెప్పాలి.
అందుకే ‘గుంటూరు కారం’ కోసం మళ్ళీ చేతులు కలిపారు త్రివిక్రమ్ – మహేష్ బాబు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. జనవరి 12న రిలీజ్ కాబోతుంది. కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింప్స్,పాటలు అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మరికొద్ది గంటల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ లోపు ‘గుంటూరు కారం’ కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. నేను సెన్సార్ సభ్యుడిని, క్రిటిక్ ని అంటూ చెప్పుకుని తిరిగే ఉమైర్ సంధు ట్విట్టర్లో .. ‘గుంటూరు కారం’ సినిమాకి రివ్యూ ఇచ్చాడు. ‘ఈ సినిమాలో మహేష్ బాబు నటన, ఎంటర్టైన్మెంట్..బాగా వర్కౌట్ అయ్యాయట. మాస్ ఆడియన్స్ ఈ సినిమాని పెద్ద స్థాయిలో ఆదరిస్తారట.
పండుగ సీజన్ లో ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుందని, అంత పొటెన్షియాలిటీ ఉన్న కథ అని, సూపర్ హిట్ అంటూ రాసుకొచ్చి 3.5/5 రేటింగ్ ఇచ్చాడు ఉమైర్ సంధు. అతను ఫేక్ రివ్యూయర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అతని రివ్యూలు నిజమైన సందర్భాలు ఎక్కువ లేవు. కానీ ఇతని పాజిటివ్ రివ్యూ కనుక చెబితే ఆ సినిమాకు సంబంధించిన హీరోల అభిమానులు మాత్రం ఖుషి అవుతూ ఉంటారు. మరో 5 రోజుల్లో ‘గుంటూరు కారం’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీని ఫలితం ఎలా ఉండబోతుందో అందరికీ తెలిసిపోతుంది. ‘హనుమాన్’ అనే సినిమా కూడా ‘గుంటూరు కారం’ తో పాటు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మహేష్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
First Review #GunturKaaram from Overseas Censor Board: It has #MaheshBabu + Entertainment in large doses. The film has the masala to work big time with the masses. This one will rewrite the rules of the game and the festive occasion will aid its potential. Superhit !
3.5⭐️/5⭐️ pic.twitter.com/x4fAoH4nmq
— Umair Sandhu (@UmairSandu) January 7, 2024
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!