సంక్రాంతి పండుగ కానుకగా రిలీజవుతున్న సినిమాలలో గుంటూరు కారం సినిమాపై ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిందీ రైట్స్ సైతం రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. గుంటూరు కారం మూవీ హిందీ హక్కులు ఏకంగా 25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
హిందీ డబ్బింగ్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడవడం అంటే రికార్డ్ అనే చెప్పాలి. మహేష్ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా హక్కులు ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కడం కూడా ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరగడానికి కారణమని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.
గుంటూరు కారం సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. (Guntur Kaaram) గుంటూరు కారం మూవీ మేకర్స్ టేబుల్ ప్రాఫిట్ అందించిందని తెలుస్తోంది. గుంటూరు కారం కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. మహేశ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.