గుంటూరు కారం సినిమాను నైజాంలో దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమాను హైదరాబాద్ లో రికార్డ్ స్థాయి సింగిల్ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో 96 సింగిల్ స్క్రీన్లు ఉండగా 90 స్క్రీన్లలో గుంటూరు కారం మూవీ రిలీజయ్యేలా ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో సింగిల్ స్క్రీన్లు దక్కిన మూవీ గుంటూరు కారం అని తెలుస్తోంది.
గుంటూరు కారం మూవీ ట్రైలర్ విడుదలైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. నైజాంలో దిల్ రాజు ప్లానింగ్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 60 శాతం థియేటర్లు గుంటూరు కారం సినిమాకు కేటాయించారని సమాచారం అందుతోంది. సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీలో నిలవగా ఏ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
టాక్ ఆధారంగా థియేటర్ల కేటాయింపు విషయంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉన్నచోట సమస్య లేదు కానీ ఒకటి, రెండు థియేటర్లు ఉన్నచోట మాత్రం కొన్ని సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఏ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
గుంటూరు కారం (Guntur Kaaram) ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా శ్రీలీల కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. గుంటూరు కారం మూవీ ఓవర్సీస్ లో సైతం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెల నుంచి మహేశ్ జక్కన్న కాంబో మూవీ షూట్ మొదలుకానుంది.