Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • July 4, 2026 / 09:12 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Cast & Crew

  • విరాజ్ అశ్విన్ (Hero)
  • యశశ్రీ రావు (Heroine)
  • రోహిణి హట్టంగడి, ప్రియదర్శిని రామ్,శివన్నారాయణ, వైవా రాఘవ,పవన్ సిద్ధు, అనీష్ కురువిల్ల,మేఘనా సునీల్ తదితరులు (Cast)
  • వినోద్ గాలి (Director)
  • శరత్ చంద్ర నాయుడు (Producer)
  • సుహాస్ (Music)
  • రేహాన్ షేక్ (Cinematography)
  • శ్రీధర్ సోంపల్లి, వెంకటేష్ చుండూరు (Editor)
  • Release Date : 3rd జూలై 2026
  • 90's కిడ్స్ ఎంటర్టైన్మెంట్ (Banner)

‘బేబీ’ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్.. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. నాని వంటి పెద్ద హీరో నటించిన ‘హాయ్ నాన్న’ లో కీలక పాత్ర చేసినా అతని కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు. అయితే ఈ వారం చాలా సైలెంట్ గా ‘గుర్తుకొస్తున్నాయి’ అనే వెబ్ సిరీస్..తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.జూలై 3 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో 7 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సిరీస్ మేరకు అలరించిందో తెలుసుకుందాం రండి :

Gurthukosthunnayi Web Series Review

Gurthukosthunnayi Web-Series Review And Rating

కథ: సంతోష్ (విరాజ్ అశ్విన్) తన ప్రిన్సిపాల్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) కూతురైన వైశాలిని (యశశ్రీ రావు) చిన్నప్పటి నుండీ ప్రేమిస్తుంటాడు. వైశాలికి కూడా సంతోష్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తమ ప్రేమ విషయాన్ని వైశాలి తండ్రికి చెప్పాలని ఆమె ఇంటికి వెళ్తాడు సంతోష్. అయితే రఘునాథ్‌కు సంతోష్ అంటే ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూతురు ప్రేమని కాదనలేక, కొన్ని కండిషన్లు పెట్టి వీరి పెళ్లికి ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో రఘునాథ్ పెట్టిన టెస్టులన్నీ సంతోష్ పాసవుతాడు.అంతా బాగానే ఉందనుకుని సంతోష్, వైశాలి పెళ్లికి రెడీ అవుతారు. అప్పుడు సంతోష్ తన చిన్ననాటి స్నేహితులైన గణేష్ (వైవా రాఘవ), ఆనంద్ (గోదావరి గోపి), శ్రీకాంత్ (పవన్ సిద్దు) లకు ఫోన్ చేసి పెళ్ళికి ఆహ్వానిస్తాడు. అయితే వాళ్ళు గోవాలో బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని కోరుతారు. సంతోష్ కూడా అందుకు ఓకే చెబుతాడు.

​కానీ, పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత సిటీ దాటి ఎక్కడికీ వెళ్లొద్దని అప్పటికే రఘునాథ్.. వైశాలి ద్వారా సంతోష్‌కు చెప్పిస్తాడు. అయినప్పటికీ వాళ్ళకు చెప్పకుండా ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకి వెళ్ళేందుకు సంతోష్ రెడీ అవుతాడు. అలా కారులో గోవాకి వెళ్తున్న టైంలో వాళ్లు అనుకోకుండా యాక్సిడెంట్‌కు గురవుతారు. స్నేహితులకు ఏమీ కాదు కానీ, సంతోష్ మాత్రం తన గతాన్ని మర్చిపోతాడు.ఇంకో వారం రోజుల్లో పెళ్లి అనగా .. సంతోష్ గతం మర్చిపోయాడనే విషయం తెలిస్తే, వైశాలి తండ్రి ఎక్కడ పెళ్ళి ఆపేస్తాడో అని స్నేహితులు, అలాగే సంతోష్ తల్లిదండ్రులు భయపడతారు. ఈ ప్రాబ్లమ్‌ను వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు? చివరికి సంతోష్‌కు తన గతం గుర్తుకొచ్చిందా? అనేది మిగిలిన కథ.

Gurthukosthunnayi Web-Series Review And Rating

నటీనటుల పనితీరు: విరాజ్ అశ్విన్ ఇందులో కొత్తగా చేసింది ఏమీ లేదు. సింగిల్ ఎక్స్ప్రెషన్ తో లాగించేశాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఎక్స్ప్రెషన్ మారలేదు. లుక్స్ వైజ్ ఓకె.! హీరోయిన్ యశశ్రీ రావు లుక్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఆకట్టుకోవు. ఆమె చిన్నప్పటి పాత్ర చేసిన పాప మాత్రం బాగా చేసింది. అయితే హీరోయిన్ తండ్రిగా చేసిన ప్రియదర్శిని రామ్ మాత్రం ప్రిన్సిపాల్ పాత్రకి కరెక్ట్ గా సెట్ అయ్యాడు. నటుడిగా కూడా ఎక్కువ మార్క్స్ కొట్టేస్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ, వైవా రాఘవ తమ మార్క్ కామెడీతో అలరించే ప్రయత్నం చేశారు. వివాహ భోజనంభు ఫేమ్ జేడీ కూడా ఉన్నంతలో తన కామెడీతో ఆకట్టుకున్నాడు. గోపరాజు రమణ, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్లు తమ పాత్రలకి న్యాయం చేశారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి ఇందులో చిన్న కేమియో ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.మిగతా నటీనటులు ఓకే.

Gurthukosthunnayi Web-Series Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: చైల్డ్ హుడ్ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో .. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ ‘ నుండీ చూసుకుంటే ‘కమిటీ కుర్రోళ్ళు ‘ వంటి ఎన్నో హిట్ సినిమాలు ఆ లిస్టులో ఉంటాయి. ఈ ‘గుర్తుకొస్తున్నాయి’ కూడా ఆల్మోస్ట్ అలాంటి కేటగిరీ (సిరీస్) ప్రాజెక్ట్ అనే చెప్పాలి. 7 ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్ లో మొదటి 3 ఎపిసోడ్స్ స్లోగా ఉన్నాయి. 4వ ఎపిసోడ్ నుండీ కొంచెం బెటర్ అనిపిస్తాయి. 5,6 కొంచెం సస్పెన్స్ తో, కామెడీతో అలా సాగిపోతాయి.

కానీ లాస్ట్ ఎపిసోడ్ ను ఎమోషన్ తో నింపేశారు. కథ పాతదే అయినప్పటికీ .. స్క్రీన్ ప్లే పరంగా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ని, 90’s ఆడియన్స్ ని బాగా టార్గెట్ చేశారు. అప్పటి సినిమాల్లోని పాటలు, వాక్మెన్లు , సీడీలు, క్యాసెట్లు వంటివన్నీ నోస్టాలజిక్ ఫీల్ కలిగిస్తాయి. సంభాషణలు బాగానే ఉన్నా .. కొన్ని చోట్ల ఫ్రెండ్స్ గ్యాంగ్ పలికే డైలాగులు హద్దులు దాటిన ఫీలింగ్ కలిగిస్తాయి. సుహాస్ మ్యూజిక్ లో ఒక పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ ఆల్మోస్ట్ పాటల్లోని ట్యూన్లె వాయించేశారు. శరత్ చంద్ర ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.

Gurthukosthunnayi Web-Series Review And Rating

విశ్లేషణ: గుర్తుకొస్తున్నాయి నోస్టాలజిక్ ఫీల్ ఇచ్చినప్పటికీ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడంతో నా ఆటోగ్రాఫ్, కమిటీ కుర్రోళ్ళు రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఓటీటీ కంటెంట్ కాబట్టి ఈ వీకెండ్ కి ఒకసారి ట్రై చేయొచ్చు.

Gurthukosthunnayi Web-Series Review And Rating

ఫోకస్ పాయింట్: 90’s కిడ్స్ కి మాత్రమే

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ETV Win
  • #Gurthukosthunnayi
  • #Gurthukosthunnayi Web-Series
  • #Priyadarshini Ram
  • #Rohini Hattangadi

Reviews

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

11 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

12 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version