ఇటీవల కాలంలో చాలా మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అందరూ కూడా సూపర్ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువమంది సంగీత దర్శకులు ఉండటం వల్ల కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ఈ పోటీలో నెగ్గటమే కాకుండా ఎక్కువ సినిమా అవకాశాలు సాధించడం మాటలు కాదు. కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా 100 సినిమాలు చేసి వావ్ అనిపిస్తున్నాడు. ఈ అరుదైన ఫీట్ సాధించింది మరెవరో కాదు అసురన్ (Asuran) , ఉల్లాసంగా ఉత్సాహంగా,డార్లింగ్ (Darling) , ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) !
నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో రెండు మూడు సినిమాలకు మంచిగా సంగీతం అందించకపోయినా, లేదంటే చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా సంగీత దర్శకుల కెరీర్ ముగిసిపోతుంది. ఇలాంటి టైంలో 100 సినిమాలు చేసి జీవీ ప్రకాష్ కుమార్ తన సత్తా చాటుకున్నాడు. ఈ రోజుల్లో ఈ అరుదైన రికార్డుని ఎవరూ టచ్ చేయలేరని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ కంపోజర్ యాక్టర్‌గానూ అలరిస్తుంటాడు. మ్యూజిక్ ఇతని రక్తంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవీ… ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అవుతాడు.
ఏఆర్ రెహ్మాన్, హరీష్ (Harris Jayaraj) , యువన్ (Yuvan Shankar Raja), దేవిశ్రీ(Devi Sri Prasad), తమన్(S.S.Thaman), అనిరుద్(Anirudh Ravichander).. ఇలా చాలామంది మ్యూజిక్ ప్రొడ్యూసర్లు దూసుకెళ్తున్న సమయంలోనే జీవీ ప్రకాష్ పరిచయమయ్యాడు. కానీ వారందరికీ భిన్నంగా ఇతని మ్యూజిక్ ఉంటుంది. ఆ ప్రత్యేకమైన స్టైల్ కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా తమిళ హీరోలు, దర్శకులు జీవీ మ్యూజిక్ కొడితే తమ సినిమా హిట్ అయిపోతుందనే నమ్మకానికి వచ్చారు. ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ తాను పనిచేసిన సినిమాల్లో ఏదో ఒక హిట్ సాంగ్ వుండేలా జాగ్రత్త పడతాడు.
అవే అతనికి బాగా పేరు తెచ్చి పెడుతుంటాయి. జీవీ చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపు హిట్ అయ్యాయి. ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలకి మ్యూజిక్ అందించింది జీవీ ప్రకాషే! నవంబర్ 14న ఆయన మ్యూజిక్ ఇచ్చిన ‘మట్కా’ (Matka) థియేటర్లలో రిలీజ్ కానుంది. నితిన్ (Nithin Kumar) హీరోగా వస్తున్న ‘రాబిన్ హుడ్’ (Robinhood) కి కూడా జీవీనే మ్యూజిక్ అందిస్తున్నాడు. జీవీ 100వ సినిమా సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నాఒక అప్‌కమింగ్ ప్రాజెక్ట్.
ఈ సినిమాతో జీవీ (GV Prakash Kumar) మ్యూజిక్ డైరెక్టర్ల 100 క్లబ్ లో జాయిన్ అయిపోతాడు. నటుడిగా కూడా జీవీ ప్రకాష్ నెలలో 12 రోజుల పాటు షూటింగ్లో పాల్గొంటాడు. మిగతా సమయంలో తాను ఒప్పుకున్న సినిమాలకు మ్యూజిక్ రెడీ చేస్తుంటాడు. అయితే మరీ చివరి నిమిషం దాకా సినిమా మేకర్స్ ని తిప్పించుకోడు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందుగానే మ్యూజిక్ వర్క్ పూర్తి చేస్తాడు. దర్శక నిర్మాతలు మ్యూజిక్ కంపోజింగ్ బాధ్యతలు ఇతడికే ఇవ్వడానికి ఇది మేజర్ రీజన్ అని చెప్పవచ్చు.