Bigg Boss 5 Telugu: హమీదా ఎందుకు ఎలిమినేట్ అయ్యింది..!

బిగ్ బాస్ హౌస్ లో హమీదా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. నిజానికి 5వ వారం తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉంటే అందులో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అందులో లోబో, ‌విశ్వ, ఇంకా హమీదాలు ఉన్నారు. ఈముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుందనుకున్నారు. హమీదా ఉంటే శ్రీరామ్ తో లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది కాబట్టి, మరికొన్ని వారాలు హౌస్ లో ఉంచే అవకాశం ఉందని అనుకున్నారు. అందుకే విశ్వ లేదా లోబోల్లో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చని కూడా ఊహించారు. కానీ, అనూహ్యంగా హమీదాని ఎలిమినేట్ చేస్తూ షాకిచ్చారు.

అసలు హమీదా గేమ్ మొదటి నుంచీ చూసిటనట్లయితే టాస్క్ లు ఆడింది ఎక్కడా కూడా లేదు. ఎగ్రెసివ్ గా పెర్ఫామెన్స్ కూడా లేదు. శ్రీరామ్ చంద్రకి మాత్రం ఫేవర్ గా ఉంది. అంతేకాదు, మిడనైట్ ప్లయింగ్ కిస్స్ లు ఇచ్చుకోవడం, శ్రీరామ్ – హమీదాలు ఒకరికొకరు ఫేవర్ గా గేమ్ ఆడటం అనేది కూడా హమీదా గేమ్ ని దెబ్బకొట్టింది. కిచెన్ లో రేషన్ మేనేజర్ గా చేసినపుడు హౌస్ మేట్స్ నుంచీ వ్యతిరేకత వచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడం అనేది హమీదాకి మైనస్.

అసలు హమీదా ఎవరో బిగ్ బాస్ కి వచ్చేవరకూ ఎవరికీ తెలీదు. కేవలం సాహసం చేయరా ఢింబకా అనే ఒకే ఒక సినిమా తెలుగులో చేసింది. అదే ఫేమ్ తో హౌస్ లోకి అడుగుపెట్టింది. మిగతా వాళ్లతో పోటీ పడలేకపోయింది అందుకే ఎలిమినేట్ అయ్యింది. అంతేకాదు, హమీదాని ఎలిమినేట్ చేయడం వల్ల శ్రీరామ్ గేమ్ పైన ఫోకస్ పెడతాడు. దానివల్ల కంటెంట్ బాగా వస్తుంది. మిగతా వాళ్లకి టఫ్ ఫైట్ ఇస్తాడు. ఇప్పటికే శ్రీరామ్ హౌస్ లో టాస్క్ లు చాలా ఎగ్రెసివ్ గా ఆడుతున్నాడు. ఇప్పుడు హమీదా కూడా లేకపోతే ఆరోవారం అతని గేమ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus