బిగ్ బాస్ హౌస్ లో రోబో ఫ్యాక్టరీ టాస్క్ అనేది ఆసక్తికరంగా జరుగుతోంది. ఇక్కడే ఫ్యాక్టరీ ఓనర్స్ గా రోబో పార్ట్స్ ని క్వాయిన్స్ ఇచ్చి కొనుక్కుంటున్నారు. అషూరెడ్డి, అరియానా, బిందుమాధవి ముగ్గురూ తమకి కేటాయించిన వాటిలో రోబోలని తయారు చేస్తున్నారు. ఒక్కో రోబో తయారు అయిన తర్వాత వాటిని జాగ్రత్తగా దాచుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇక్కడే హమీదా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. క్యాజువల్ గా క్వాయిన్స్ పక్కనబెట్టి కూర్చున్న బిందుమాధవిని హెచ్చరిస్తూ క్వాయిన్స్ కొట్టేసుకుంది.
దీంతో బిందు మాధవి క్వాయిన్స్ హమీదా దగ్గర లాక్ అయిపోయయి. కొంచెం సేపు రిక్వస్ట్ చేసిన బిందు ఆ తర్వాత వదిలేసింది. నాది తప్పు అంటూ మాట్లాడింది. అలాగే, క్వాయిన్స్ ని లాస్ట్ వరకూ ఉంచుకుంటే శివకి ఇవ్వచ్చని కూడా అనుకుంది బిందు. కానీ, హమీదా ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదు. ఆ తర్వాత శివని హెల్ప్ చేయమని అడిగింది. లాస్ట్ టైమ్ శివని కెప్టెన్సీ పోటాదారులుగా పంపించింది కాబట్టి శివ టాస్క్ లో హమీదాకి హెల్ప్ చేస్తున్నాడు.
తర్వాత స్రవంతి అషూరెడ్డి కొనుక్కున్న రోబో పార్ట్స్ ని కొట్టేసింది. ఈ విషయం హమీదా చూసి అషూని హెచ్చరించింది. కానీ, అషూ వచ్చేసరికి ఎవరు తన రోబోని తీశారో కనుక్కోలేకపోయింది. అందర్నీ అనుమానిస్తూ వార్నింగ్ ఇచ్చింది. ఈలోగా హమీదా స్రవంతితో డీల్ మాట్లాడుకుంది. రెండు రోబో బొమ్మలు రెడీ అయ్యాక డబ్బులు ఇస్తానని డీల్ సెట్ చేసుకుంది. ఇలా రోబో టాస్క్ లో ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఎవరి లెక్కలు వాళ్లు వర్కౌట్ చేస్తున్నారు.
కలక్ట్ చేసిన రోబోని, ఫ్యాక్టరీ ఓనర్స్ దగ్గర ఉన్న డబ్బులని జాగ్రత్తగా దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి పడుకోబోయే ముందు అషూరెడ్డి అఖిల్ దగ్గర తన క్వాయిన్స్ దాచుకోవడానికి డీల్ మాట్లాడింది. ఇక్కడే తన రోబోని కొట్టేసింది స్రవంతి అని తెలుసుకుని షాక్ అయ్యింది. ఇక హమీదా బిందు మాధవి క్వాయిన్స్ కొట్టేసిన తర్వాత వాటని తీస్కోవాలని చూస్తే అఖిల్ సపోర్ట్ గా ఉంటానని డీల్ మాట్లాడుకున్నాడు. ఇలా ఎవరి ప్రొటక్షన్ లో వాళ్లు ఉన్నారు. మరి రేపటి గేమ్ లో బిగ్ బాస్ ఖచ్చితంగా ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందంతుంది అనేది.