Hamsa Nandini: ఒక్క సంవత్సరంలో చాలా జరిగాయంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హంసా నందిని..

హంసా నందిని పేరు చెప్పగానే అదిరిపోయే గ్లామరస్ కలర్ ఫుల్ క్యారెక్టర్స్, స్టెప్పులెయ్యాలనిపించే స్పెషల్ సాంగ్స్ గుర్తొస్తాయి.. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుంది.. ‘ఒకటవుదాం’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హంసా నందిని ఆ తరువాత ‘786’ అనే మూవీ కూడా చేసింది కానీ.. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనుమానాస్పదం’ మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.. హీరోయిన్‌గా నిలబడలేకపోవడంతో. స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్‌కు మాత్రమే పరిమితమయ్యింది..

‘మిర్చి’ లో టైటిల్ సాంగ్ మంచి గుర్తింపు తెచ్చింది.. ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’, ‘లౌక్యం’, ‘లెజెండ్’, ‘జై లవ కుశ’ వంటి సినిమాల్లో ఓ మాదిరి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, సాంగ్స్ చేసి అలరించింది.. అయితే ఎవరూ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడింది.. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది.. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్న హంసా.. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌‌లో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది..

ఏడాది క్రితం కీమో థెరపీలో భాగంగా జుట్టు తీసెయ్యడంతో గుండుతో ఉన్న వీడియో షేర్ చేసిందామె.. క్యాన్సర్ నుండి కోలుకున్న తర్వాత తిరిగి మామూలు పరిస్థితికి చేరుకోవడంతో బీచ్ ఒడ్డున చిల్ అవుతూ జుట్టుతో ఉన్న పిక్స్ కూడా పోస్ట్ చేసింది.. మనీషా కోయిరాలా, సోనాలీ బింద్రే, లీసారే వంటి సీనియర్ నటీమణులు కూడా క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచారు.. ‘‘ఒక ఏడాదిలో చాలా జరిగాయి.. ప్రస్తుతానికైతే బాగున్నాను’’ అంటూ రాసుకొచ్చింది..

‘జుట్టు ఉన్నప్పుడే కాదు జుట్టు లేకపోయినా అందంగా ఉన్నారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా అతడిపై ముద్దుల వర్షం కురిపించింది హంసా.. ఇక మిగతా నెటిజన్లు కూడా.. ‘మీరొక రియల్ ఫైటర్.. ఓ వారియర్‌లా క్యాన్సర్‌తో పోరాడి జయించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు’ అని ప్రశంసిస్తున్నారు.. ప్రస్తుతం హంసా నందిని షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus