హిందీ నటిపై మండిపడ్డ హన్సిక!

సౌత్ సినీ పరిశ్రమలలో సినిమాలు చేసి అవకాశాలు తగ్గిపోయినప్పుడు .. ఇక్కడి పరిశ్రమలపై తక్కువగా మాట్లాడే కొంతమంది హీరోయిన్స్ ని ఇప్పటి వరకు చూసాం. తొలిసారిగా బాలీవుడ్ నేపథ్యం ఉన్న హన్సిక దక్షిణాది సినీ పరిశ్రమను అభినందించింది. హేళన చేసిన వారికి గట్టిగా బదులిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. టీవీ నటి హీనా తాజాగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 11 షో లో పాల్గొంటోంది. అక్కడ  సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడింది.  “సౌత్ హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ బాగా చేస్తారు. అందుకే వారిని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు” అని చెప్పింది. దీనిపై హన్సిక సోషల్ మీడియా వేదికపై గట్టిగా బదులు ఇచ్చింది.

“బాలీవుడ్ నటీనటులు చాలామంది సౌత్ పరిశ్రమలో పనిచేశారు. ఇంకా చేస్తున్నారు. సౌత్ హీరోయిన్స్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నందుకు హీనా సిగ్గు పడాలి. నేను దక్షినాది నటిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను” అని ట్వీట్ చేసింది. హన్సిక స్పందించడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. దీంతో హీనాఖాన్ పై నెటిజన్లు విరుచుపడుతున్నారు. వ్యూస్, రేటింగ్, పాయింట్స్ కోసం హీనా ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని సలహాఇచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus