ఒకప్పటి మాట ఇది.. బాగా సేల్స్ ఉండే సమ్మర్‌లో సమ్మర్ టైమ్‌లో కూల్ డ్రింక్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే సేల్స్ తక్కువగా ఉండే అన్ సీజన్‌లో రేటు తగ్గిస్తారు ఏంటీ లాజిక్. ఇప్పుడు పెద్దగా డ్రింక్స్ కంపెనీలు అమలు చేయని ఈ లాజిక్ గురించి తెలియాలంటే ఇప్పుడు ‘హనుమాన్’ టీమ్ అమలు చేస్తున్న బిజినెస్ ట్రిక్‌ను పరిశీలిస్తే పైన ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ‘హనుమాన్’ సినిమా టికెట్‌ను సింగిల్ థియేటర్లలో రూ. 100కే ఇస్తున్నారు తెలుసు కదా.
మొన్నీమధ్య వరకు ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడుతుండే, అలాగే జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి సినిమా చూశారు. ఆ సమయంలో ఎక్కువ రేటు పెట్టారు. ఇప్పుడు జనాల రాక తగ్గింది ఇప్పుడు రేటు తగ్గించారు. దీని వెనుక ఉన్న బిజినెస్ ట్రిక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. రేటు తగ్గింది అంటే… తర్వాత టీవీలో, ఓటీటీలో సినిమా చూద్దాం అనుకున్న ప్రేక్షకులు ముందుకొచ్చి థియేటర్లలో సినిమా చూడటమే.
అవును, కావాలంటే మీరే చూడండి సుమారు రూ. 150 నుండి రూ. 200 పెట్టి మొన్నీమధ్య వరకు సింగిల్ స్క్రీన్లలో ‘హనుమాన్’ సినిమా చూశారు ప్రేక్షకులు. అంత పెట్టడం ఎందుకు అనుకున్నవాళ్లు ఓటీటీ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో రూ. 100కే సినిమా అంటే కచ్చితంగా ముందుకొస్తారు. ఆ సినిమాను థియేటర్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియెన్సే వేరు అని ఇప్పటికే మౌత్ టాక్ ఉంది. అనుకున్నట్లుగానే జనాలు వస్తున్నారు కూడా అని టాక్.
మరోవైపు సినిమాను మార్చి మొదటివారంలో జీ5లోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ లోపు ఈ సినిమాను వీలైనంతగా థియేటర్లలో చూపించేయాలి అనేది కూడా టీమ్ ఆలోచనట. అప్పుడు మరోసారి ఓటీటీలో చూస్తారని మరో ఆలోచన ఉంది. ‘సలార్’ సినిమాను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూస్తున్నారు అనేది ఓ మాట. ఇప్పుడు థియేటర్లలో ‘హనుమాన్’ (Hanu Man )చూసి ఆ తర్వాత ఓటీటీలో చూస్తారని టీమ్ తక్కువ ధరకు టికెట్ పెట్టి ఎక్కువమందిని థియేటర్లకు రప్పిస్తోందట.
భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!