తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ‘హను-మాన్’ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 11 న ఈ సినిమా ప్రీమియర్ షోలు చాలా చోట్ల పడ్డాయి. అన్నిటికి కూడా యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి అనే భరోసా అందరిలో ఏర్పడింది.
దానికి తగ్గట్టుగా మొదటి వీకెండ్ ఒక రేంజ్లో కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఒకసారి 3 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 6.63 cr |
సీడెడ్ | 2.47 cr |
ఉత్తరాంధ్ర | 2.51 cr |
ఈస్ట్ | 1.65 cr |
వెస్ట్ | 1.01 cr |
గుంటూరు | 1.17 cr |
కృష్ణా | 0.81 cr |
నెల్లూరు | 0.53 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 16.78 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.18 cr |
హిందీ | 6.28 cr |
ఓవర్సీస్ | 11.05 cr |
వరల్డ్ వైడ్( టోటల్) | 37.29 cr (షేర్) |
‘హనుమాన్’ (Hanu Man) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.37.29 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాకుండా రూ.8.79 కోట్ల లాభాలను అందించింది.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!