2024 సంవత్సరంలో బడ్జెట్ కలెక్షన్ల పరంగా బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు హనుమాన్ మూవీ సమాధానం వినిపిస్తోంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంలో మిరాజ్ సినిమాస్ ఈరోజు ఎంపిక చేసిన థియేటర్లలో హనుమాన్ సినిమా టికెట్ ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. మరోవైపు హనుమాన్ మూవీ సంచలన రికార్డులను సొంతం చేసుకుంటోంది. హనుమాన్ మూవీ ఓవర్సీస్ లో 4 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించి ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న టాప్5 తెలుగు సినిమాలలో ఒకటిగా నిలిచింది.
ఎన్నో పెద్ద సినిమాలకు సైతం సాధ్యం కాదని రికార్డ్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హనుమాన్ మూవీ కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన అతి తక్కువ సినిమాలలో హనుమాన్ ఒకటి కావడం గమనార్హం. ఓవర్సీస్ లో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హనుమాన్ రేర్ రికార్డులు ఇవేనంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఊహించని స్థాయిలో ఉన్నాయి. హనుమాన్ టీమ్ తమ సినిమా కలెక్షన్లలో 2 కోట్ల 66 లక్షల రూపాయలు అయోధ్యకు విరాళంగా ఇవ్వడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఫుల్ రన్ లో హనుమాన్ మరిన్ని రేర్ రికార్డులను సొంతం చేసుకోనుంది.
యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం హనుమాన్ (Hanu Man) మూవీకి ప్లస్ అయింది. హనుమాన్ సక్సెస్ తో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ పేర్లు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతున్నాయి. భవిష్యత్తులో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఎంచుకునే ప్రాజెక్ట్ ల విషయంలో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.