సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలలో బడ్జెట్ పరంగా హనుమాన్ చిన్న సినిమా అయినా క్రేజ్ పరంగా ఈ సినిమా పెద్ద సినిమా అనే చెప్పాలి. హనుమాన్ మూవీ నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు 7.2 కోట్ల రూపాయలకు తీసుకున్నారని సమాచారం అందుతోంది. సలార్ సక్సెస్ తో జోరుమీదున్న మైత్రీ నిర్మాతలు వరుసగా క్రేజీ సినిమాల హక్కులను తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నిర్మాతలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
అయితే హనుమాన్ మూవీ విషయంలో నిర్మాతల కాన్ఫిడెన్స్ కు త్రీడీ వెర్షన్ అసలు కారణమని సమాచారం. హనుమాన్ మూవీ త్రీడీ వెర్షన్ లో కూడా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రేక్షకులు, చిన్నపిల్లలు ఈ సినిమాను త్రీడీలో చూడటానికి ఆసక్తి చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కానుండగా చివరి నిమిషంలో ఏదైనా మూవీ తప్పుకుంటుందేమో చూడాలి. గుంటూరు కారం మూవీ షూటింగ్ కూడా నిన్నటితో పూర్తైంది.
జనవరి 1వ తేదీ నుంచి సంక్రాంతి సినిమాల వరుస అప్ డేట్స్ సినిమాలపై అంచనాలు పెంచనున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు సైతం ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. బుక్ మై షోలో ఈ సినిమాకు 1,50,000కు పైగా ఇంట్రెస్ట్స్ వచ్చాయి.
త్వరలో హనుమాన్ (Hanu Man) మూవీ ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి సినిమాలలో హనుమాన్ ఏ స్థాయి హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. హనుమాన్ మేకర్స్ ధైర్యానికి త్రీడీ వెర్షన్ కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. హనుమాన్ మూవీతో తేజ సజ్జాకు ఏ రేంజ్ హిట్ దక్కుతుందో చూడాలి.