ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ లవ్ స్టోరీలు రాలేదు. చాలా ఏళ్ల తరువాత ‘సీతారామం’ అనే పేరుతో ఓ అందమైన, అద్భుతమైన ప్రేమకథను ఆవిష్కరించారు దర్శకుడు హను రాఘవపూడి. తొలిరోజే ఈ సినిమా క్లాసిక్ అంటూ అందరూ తీర్మానించేశారు. అంటే ఆ రేంజ్ లో జనాలకు కనెక్ట్ అయింది ఈ సినిమా. ఒక్కసారిగా అందరి దృష్టి దర్శకుడు హను రాఘవపూడిపై పడింది. హను చివరిగా తెరకెక్కించిన ‘పడిపడి లేచే మనసు’, ‘లై’ వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ‘పడిపడి లేచే మనసు’ సినిమా అతడి కెరీర్ పై చాలా ఎఫెక్ట్ చూపించింది. అలాంటి ప్లాప్ తరువాత అతడికి సినిమా అవకాశాలు రావడం కష్టమేననే మాటలు వినిపించాయి. అతడు తిరిగి మళ్లీ హిట్ కొడతాడని కూడా ఎవరూ ఊహించలేదు. అలాంటి వ్యక్తిని నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చింది వైజయంతీ మూవీస్ సంస్థ. మంచి బడ్జెట్ లో, పేరున్న నటీనటులతో ‘సీతారామం’ సినిమాను తెరకెక్కించారు హను. తనకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంచి అవుట్ పుట్ ను డెలివర్ చేశారు హను రాఘవపూడి.
ఈ సినిమా హను కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హను డైరెక్ట్ చేసిన తొలి రెండు సినిమాలు ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ అతడికి మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ కమర్షియల్ గా ఈ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో నిర్మాతలకు పూర్తి సంతృప్తి అయితే అందించలేకపోయాయి. హను కథలు చాలా బాగుంటాయని.. మంచి ఫీల్ ఇస్తాయని..
కానీ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అతడి బలహీనత అని విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ కామెంట్స్ హను వరకు వెళ్లాయి. అందుకే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈసారి ఆ తప్పులను సరిదిద్దుకున్నట్లు చెప్పారు. నిజంగానే ‘సీతారామం’ సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నారు హను.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?