Adipurush: ఆదిపురుష్ డైలాగ్ లో చేసిన మార్పు ఇదే.. ప్రయోజనం ఉంటుందా?

ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఎన్నో వివాదాల్లో చిక్కుకుని వీక్ డేస్ లో దారుణంగా కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ మూవీ వివాదాల్లో చిక్కుకోవడం ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది. రైటర్ మనోజ్ ముంతాషిర్ చేస్తున్న కామెంట్ల వల్ల ఈ సినిమా మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమాకు దారుణంగా కలెక్షన్లు వస్తున్నాయని బోగట్టా.

అయితే Adipurush) ఈ సినిమాలో హనుమంతుని డైలాగ్స్ విషయంలో ఎన్నో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హనుమంతుని పాత్ర చేత ఊరమాస్ భాషను మాట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయగా చిత్రయూనిట్ ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమా డైలాగ్స్ కు సంబంధించి కీలక మార్పులు చేశారు. బాబుదే అనే పదానికి బదులుగా లంకదే అని మార్చారని సమాచారం.

ఇందుకు సంబంధించిన హిందీ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్లిప్ ను చూసిన నెటిజన్లు ఈ మార్పు వల్ల మరీ భారీ స్థాయిలో బెనిఫిట్ అయితే ఉండదని కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ కు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని ఇలాంటి మైథలాజికల్ సినిమాలకు ప్రభాస్ దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ప్రభాస్ తన కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ప్రభాస్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా 150 కోట్ల రూపాయల వరకు ప్రభాస్ కు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ యాడ్స్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus