ఫస్ట్ ఫిలిం ‘అ!’ తోనే ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. రాజ శేఖర్ లాంటి సీనియర్ యాక్టర్‌తో రెండో సినిమాగా ‘కల్కి’ తీసి మరోసారి షాకిచ్చాడు. తేజ సజ్జాను హీరోగా పెట్టి తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి జాంబీల బ్యాక్ డ్రాప్‌లో ‘జాంబి రెడ్డి’ తెరకెక్కించిన ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ సూపర్ హీరో హనుమంతుడిని చూపించబోతున్నాడు.
తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా.. ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న పాన్ ఇండియా ఫిలిం.. ‘హనుమాన్’.. ‘ది మోస్ట్ పవర్‌ఫుల్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్’ అంటూ హనుమంతుడి శక్తిసామర్థ్యాల ఆధారంగా.. శ్రీమతి చైతన్య సమర్పణలో.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ‘హనుమాన్’ టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ సింప్లీ సూపర్బ్ అని చూసిన వాళ్లంతా చెప్తున్నారు. ప్రశాంత్ వర్మ మరోసారి మ్యాజిక్‌తో పాటు మెస్మరైజ్ కూడా చేయనున్నాడనేలా ఉంది టీజర్.. విజువల్స్ మామూలుగా లేవసలు.. టీజర్ ఓపెనింగ్‌లోనే భారీ ఆంజనేయుడి విగ్రహం చూపించి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. బ్యాగ్రౌండ్‌లో వాయిస్ ఓవర్‌గా పవర్‌ఫుల్ హనుమాన్ శ్లోకం వస్తుండగా.. కథలోని కీలకఘట్టాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వచ్చాడు.
హనుమంతుడి సూపర్ నేచర్ పవర్స్ హీరోకి ఎలా అన్వయిస్తారనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్‌లో రౌడీలు గాల్లో ఎగురుతుండగా.. బ్యాగ్రౌండ్‌లో ఆంజనేయుడి విగ్రహం చూపించడం.. టీజర్ చివర్లో హనుమంతుడి చుట్టూ నీరు గడ్డకట్టడం లాంటి విజువల్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. శివేంద్ర విజువల్స్, గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. వరలక్షీ శరత్ కుమార్, వినయ్ రాయ్ (వాన ఫేమ్), రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రల్లో కనిపించనుండగా.. వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.