Happy Birthday Collections: సోమవారం రోజు తుస్సుమన్న ‘హ్యాపీ బర్త్ డే’ కలెక్షన్స్..!

సర్రియల్ కామెడీ జోనర్ లో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. “మత్తువదలరా” చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ తో ఆకట్టుకున్న రితేష్ రాణా దర్శకత్వంలో ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్’, ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ల పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ ను రాబట్టుకుంది.

‘మైత్రి’ వంటి బడా నిర్మాతలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సినిమా కావడంతో మొదటిరోజు ఈ చిత్రం 200 కి పైగా థియేటర్లలో విడుదలయ్యింది. మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ఈ చిత్రం 4వ రోజు బాక్సాఫీస్ చేతులెత్తేసింది .ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.23 cr
సీడెడ్ 0.10 cr
ఉత్తరాంధ్ర 0.12 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.09 cr
కృష్ణా 0.10 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.07 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.88 cr

‘హ్యాపీ బర్త్ డే’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ ఈ చిత్రం రూ.1.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ చిత్రం రూ.0.88 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.0.62 కోట్ల షేర్ ను రాబట్టాలి. సోమవారం రోజు ఈ చిత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. వర్షాల ప్రభావం ఒకవైపు.. నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ మరో వైపు ఈ చిత్రం బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ని దెబ్బ కొట్టాయి అని స్పష్టమవుతుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus