Hari Hara Veera Mallu: ఫ్లాప్ డైరెక్టర్ కు పవన్ ఛాన్స్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
- May 2, 2024 / 03:48 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కాంబినేషన్ లో ఏఎం రత్నం (A. M. Rathnam) నిర్మాతగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో ఈ టీజర్ విడుదల కాగా ఈ టీజర్ యూట్యూబ్ లో నంబర్2 లో ట్రెండింగ్ అవుతోంది, ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేసిన పోస్టర్ లో డైరెక్టర్ క్రిష్ (Krish Jagarlamudi) పేరు మిస్ కాగా తాజాగా విడుదలైన టీజర్ లో దర్శకుడు క్రిష్ పేరు ఉన్నా మరో దర్శకుడు జ్యోతికృష్ణ పేరు కూడా ఉంది. హరిహర వీరమల్లు కొత్త డైరెక్టర్ జ్యోతికృష్ణ అని తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది. నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ (Oxygen) సినిమాలకు రైటర్, డైరెక్టర్ గా పని చేసిన జ్యోతికృష్ణ (A. M. Jyothi Krishna) ఆ సినిమాలతో ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారు.

ఈ సినిమా మిగిలిన షూటింగ్ ను జ్యోతికృష్ణ పూర్తి చేయనున్నారని క్రిష్ పర్యవేక్షణలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహించనున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారా లేక ఆయనను తప్పించారా అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియాల్సి ఉంది. క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా రిజల్ట్ విషయంలో సైతం ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

మరోవైపు హరిహర వీరమల్లు మూవీ టీజర్ విడుదలైనా ఈ టీజర్ లో రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత లేకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తి కాలేదని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. పవన్ హరిహర వీరమల్లు సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

















