పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా వాయిదాలతో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈ పీరియడ్ డ్రామా షూటింగ్ ఇంకొంత బ్యాలెన్స్ ఉండడంతో రిలీజ్ విషయంలో క్లారిటీ రావడం లేదు. నిర్మాత రత్నం (AM Rathnam) మే 30 సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, పవన్ కళ్యాణ్‌కు ఇంకా 3-4 రోజుల షూటింగ్ బాకీ ఉంది. ఈ సినిమా రిలీజ్ అయితే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ‘కింగ్ డమ్’ (Kingdom) సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది.
అయితే వీరమల్లు చెప్పిన సమయానికి రాకుంటే మళ్ళీ మంచి సమ్మర్ స్లాట్ ఎవరికి కాకుండా పోతుంది. ఈ సినిమా గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతోంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ దాదాపు పూర్తయింది, కానీ రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ‘హరిహర వీరమల్లు’ మే 30న రిలీజ్ అయితే, అదే టైంలో వస్తున్న ‘కింగ్ డమ్’ సినిమాకు పోటీ ఎదురవుతుంది.
‘కింగ్ డమ్’ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ విషయంలో త్రివిక్రమ్ సలహాతోనే పవన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ‘హరిహర వీరమల్లు’ వాయిదా పడితే, మంచి రిలీజ్ డేట్ వృథా అయ్యే ప్రమాదం ఉంది. ఈ చిక్కుముడిని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మాత్రమే తేల్చగలరని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
పవన్ తన సినిమాలను వరుసగా లైన్‌లో పెడుతున్నారు, అందులో త్రివిక్రమ్ సలహాలు కీలకంగా ఉన్నాయి. ఇక పవన్ ను ఒప్పించి షూటింగ్ పూర్తి చేయిస్తారా లేదంటే వీరమల్లుని వాయిదా వేసి కింగ్ డమ్ ను రప్పిస్తారా అనేది కాలమే సమాధానం ఇవ్వాలి. హరిహర వీరమల్లు’లో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్ (Bobby Deol) విలన్‌గా నటిస్తున్నారు.