Shilpa Shirodkar: ‘రాజాసాబ్’ విలన్ కి జోడీగా మహేష్ మరదలు?

మహేష్ బాబు (Mahesh Babu) సతీమణి నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) అందరికీ సుపరిచితమే. టాలీవుడ్లో బెస్ట్ కపుల్ అంటే వీళ్ళ పేర్లే చెబుతారు. కానీ నమ్రతకి చెల్లెలు కూడా ఉందని.. ఆమె పేరు శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) అని చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె కూడా నమ్రత మాదిరి ఒక పెద్ద మోడల్..! గతంలో ఈమె తెలుగులో మోహన్ బాబు (Mohan Babu) హీరోగా బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ‘బ్రహ్మ’ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. అది పెద్దగా ఆడకపోవడంతో..

Shilpa Shirodkar

తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే హిందీ సినిమాల్లో నటిస్తోంది. అలాగే ‘బిగ్ బాస్ 18’ లో కూడా ఓ కంటెస్టెంట్ గా పాల్గొంది. త్వరలో తెలుగు సినిమాతో రీ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. విషయంలోకి వెళితే… సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా ‘జటాధర’ అనే సినిమా రూపొందుతుంది. ఇదొక సూపర్ నేచురల్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది.

ఇందులో సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా రోహిత్ పాఠక్ (Rohit Pathak) నటిస్తున్నాడు. ‘ఖాకీ’ ‘సీటీమార్’ (Seetimaarr) ‘సీతా రామం’ (Sita Ramam) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి హిట్ సినిమాలతో ఇతను తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమాలో కూడా ఓ విలన్ గా నటిస్తున్నాడు.

ఇక ‘జటాధర’ లో రోహిత్ మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇతని భార్య పాత్రలో శిల్పా శిరోద్కర్ కనిపించనుందట. ఈమె రోల్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా వదిలే అవకాశం ఉంది. మరి రీ ఎంట్రీలో అయినా ఈమె టాలీవుడ్లో సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సినీ పరిశ్రమలో విషాదం.. కాలేయ సమస్యలతో నటుడు కన్నుమూత!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus