జూనియర్ ఎన్టీఆర్ గురించి హరికృష్ణ ఫస్ట్ టైమ్ పబ్లిక్‌లో ఏమన్నారంటే..!

  • December 7, 2022 / 12:21 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు, బాలకృష్ణ తర్వాత ఆ ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ నటుడిగా చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చి.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. నూనుగు మీసాల ప్రాయంలోనే బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు.. తారక్ ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా పైకొచ్చాడు.. తనకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని అప్పట్లో పలు వార్తలు వచ్చేవి.. తండ్రి హరికృష్ణ ఈ వార్తలపై ఓ సినిమా ఫంక్షన్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.. ఆ అరుదైన సంఘటనకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం..

హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాక ఓ అవార్డ్ ఫంక్షన్‌లో బాబాయ్ బాలయ్యతో తారక్ కనిపించడం.. దండ వెయ్యడం.. ఇంతకాలం ఎదురు చూస్తున్న లైఫ్ టైం కోరిక నెరవేరడంతో ఎమోషనల్ అయి ఏడ్చేశాడు ఎన్టీఆర్.. ఈ పిక్స్ అయితే అభిమానులకు ఇప్పటికీ ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి.. అయితే తండ్రి హరికృష్ణతో కలిసి (హీరో అయిన తర్వాత) ప్రేక్షకాభిమానులకు కనిపించింది మాత్రం ‘శివ రామ రాజు’ ఆడియో విడుదల కార్యక్రమంలోనే..

అప్పటికే ‘శ్రీరాములయ్య’ (కీలక పాత్ర), ‘సీతా రామ రాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన హరికృష్ణ.. జగపతి బాబు, వెంకట్, శివాజీ, మోనిక ప్రధాన పాత్రల్లో నటించగా.. వి. సముద్ర డైరెక్ట్ చేసిన ‘శివ రామ రాజు’ లో ఆనంద భూపతి రాజుగా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ ఆడియో వేదికపై తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలను పర్మిషన్ అడిగి మరీ ఆసక్తికర విషయాలు వెల్లడించారాయన.

‘‘తారక్‌ని మేమెవరం పట్టించుకోవడం లేదని.. ఏకాకిని చేశామని పుకార్లు పుట్టించారు.. అదంతా అబద్ధం.. ఎవరికి వారు స్వశక్తితో ఎదగాలి.. మా తండ్రి రామారావు గారిని ఎవరు పరిశ్రమకు తీసుకొచ్చారు?.. ఎవరు వెన్ను తట్టి నడిపించారు?.. ఒంటరిగానే వచ్చారు.. ఒంటరిగానే పోరాటం చేశారు.. బాలకృష్ణ హీరోగా ఎలా ఎదిగారు?.. మా నాన్న గారు ఎప్పుడైనా నా బిడ్డను పైకి తీసుకురమ్మని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరారా.. లేదే.. నా విషయమే తీసుకుంటే నేనi నాన్నగారికి డ్రైవర్‌గా పని చేశాను..

మా సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ కూడా ఛీఫ్ కంట్రోలర్‌గానే పేరు వేసుకున్నాను.. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేనూ పైకొచ్చాను.. కాబట్టి ఎవరికి వాళ్లే పైకి రావాలి.. అలాకాకుండా అనుక్షణం వారిని గమనిస్తూ, సలహాలిస్తూ పోతే ఎప్పుడూ పైకి రారు.. తారక్ స్వయం శక్తితో పైకి వస్తుంటే చూస్తూ ఆనందిచడంలో తండ్రిగా ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నాను.. తారక్ తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ అప్పుడు కథ మాత్రం విన్నాను.. ఆ తర్వాత పట్టించుకోలేదు..

తనకు తానుగా నిర్ణయాలు తీసుకునే శక్తి రావాలానే అలా చేశాను’’.. అంటూ క్లారిటీ ఇచ్చారు.. మరిన్ని వివరాలు ఈ ఇంటర్వూ పేపర్‌లో ఉన్నాయి.. తమ ఫ్యామిలీ నుండి వచ్చిన, రాబోయే నటుల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత కళ్యాణ్ రామ్ ‘హరే రామ్’ ఫంక్షన్‌లోనూ తారక్ తన మూడో బిడ్డ అని అన్నారు హరికృష్ణ.. జగపతి బాబు.. నందమూరి తండ్రి తనయుడు ఇద్దరినీ కలిపి గజమాలతో సత్కరిచడం హైలెట్.. అలా తారక్ తండ్రిని కలిసిన ‘శివ రామ రాజు’ పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus