మహానటి సాక్షిగా హరితేజకి ఘోర అవమానం

బుల్లి తెరపై వివిధ కార్యక్రమాలతో పరిచయయమైన హరితేజ… త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ.. ఆ మూవీ ద్వారా వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.  విన్నర్, ఉంగరాల రాంబాబు వంటి సినిమాల్లో అవకాశం అందుకుంది. అలాగే ఆమె కెరీర్ బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇటు బుల్లితెర, వెండితెరపైనా బిజీ అయిపోయింది. అయితే ఈమెకు రీసెంట్ గా ఘోరమైన అవమానం జరిగింది. మహానటి సినిమా చూసేందుకు వెళ్లిన హరితేజ తో ఒకావిడ బాధకలిగించే విధంగా మాట్లాడింది. ఆ విషయాన్నీ ఈరోజు సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది. “అమ్మా, నాన్న, నేను, చెల్లి అంతా కలిసి ‘మహానటి’ చూడటానికి ఒక థియేటర్ కు వెళ్లాము.

ఇంటర్వెల్ వరకు చెల్లిపక్కన కూర్చున్నాను. తర్వాత అమ్మ అడగటంతో ఆమె పక్కన వెళ్లి కూర్చున్నాను. నేను అమ్మ వైపుకు వెళుతున్న తరుణంలో నాన్నను ఇటు వైపుకు షిప్ట్ చేయాల్సి వచ్చింది. అపుడు ఇటు వైపు ఉన్న ఒక తల్లీకూతుళ్లు నాతో వాదనకు దిగారు. ‘ఇంతకు ముందు కూర్చున్నారు కదమ్మా… అలాగే కూర్చోండి, మీ నాన్న పక్కన కూర్చునేందుకు నా కూతురు కంఫర్టబుల్‌గా లేదు అని చెప్పారు. నేను “తప్పేంటి ఆంటీ తండ్రే కదా?”అని అన్నాను.

ఆ సమయంలో ఆవిడ “మీరైతే సినిమా వాళ్లమ్మా… ఎవరి పక్కనైనా కూర్చుంటారు, మాకు ఆ దరిద్రం పట్టలేదన్నారు” అని ఆమె అనడంతో నాకుకోపం వచ్చింది. ఆపుకోవడం నా వల్ల కాలేదు” అని తెలిపారు. “మనందరం చదువుకున్న వాళ్లం, మంచి కుటుంబాల నుండి వచ్చిన వాళ్లం. సినిమా పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలు వేరే, బయట ఉన్న ఆడపిల్లలు వేరే… ఇలా మాట్లాడటం మానండి. ఇష్టం వచ్చినట్లు అలాంటి కామెంట్లు చేయవద్దు. అపుడే మీ జీవితాలు, మా జీవితాలు బావుంటాయి” అని హరితేజ కోరింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus