బిగ్‌బాస్‌ UNSEEN: అభిజీత్ కి పెళ్లి అయిపోయిందట… ఏమో హారిక చెప్పింది!

చీర కట్టులో చాలా రకాలు ఉన్నాయని మీకు తెలిసిందే. ఒక్కో ఏరియాలో ఒక్కోలా కట్టు ఉంటుంది. అయితే కట్టుకోవడం మాత్రమే ఒకటేలా ఉంటుంది. కానీ బిగ్ బాస్ లో నోయల్ అండ్ హారిక కొత్తగా చూపించారు. ఉతికిన చీరలను విలేజ్ స్టయిల్ లో గంగవ్వ గార్డెన్ ఏరియా లో ఆరబెట్టుకుంది. అది చూసిన నోయల్ కి ఒక ఆలోచన వచ్చింది. అవ్వ నీకు కొత్తగా చీర కట్టడం చూపిస్తా అంటూ రెడి అయ్యాడు. తోడుగా హరికను తెచ్చుకున్నాడు. ఒక మంచి చీర తీసుకున్నాడు.

చీరను సెంటర్ చేసి ఆ చివరి నుంచి ఈ చివరకు దొర్లాడు. ఇంకేముంది చీర చుట్టుకుపోయింది. చీర కట్టినట్లు అయిపోయింది. బాగుంది కదా ఈ స్టైల్. ఆ తరవాత హారిక హెల్ప్ తో మరో స్టైల్ కుడా చూపించాడు. ఈ క్రమంలో 90s విలన్ లా హారిక చేసిన యాక్టింగ్ సూపర్ అంతే. ఏమన్నా రౌడీ బేబీ ఉంటే ఆ సందడే వేరు. అభిజీత్ కూడా అదే మాట అన్నాడు.

హారిక సరదా అల్లరి అక్కడితో ఆగలేదు. వాష్ రూమ్ లో అవినాష్ మైక్ దాచేసింది. అవినాష్ ఎంత వెతికినా దొరకలేదు. ఆఖరికి హారిక నే తెచ్చి ఇచ్చింది. ఈ మొత్తం బ్లాక్ నిన్న ఎపిసోడ్ లో చూపించలేదు కానీ .. భలే ఫన్నీ ఉండింది. ఈ మైక్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడే అభిజీత్ పెళ్లి టాపిక్ వచ్చింది. అభిజీత్ పెళ్లి గోల గురించి చెప్తే… హారిక ‘అభిజీత్ కి పెళ్లి అయిపోయింది’ అంటూ ఆట పట్టించింది.

Click Here To Watch

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus