బిగ్ బాస్ 4: సీక్రెట్ గేమ్ లో సక్సెస్..!

బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో తనదైన స్టైల్లో ఆడిన హారిక ఇప్పుడు ఆడియన్స్ హృదయాలని గెలుచుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన మూడు హత్యలని దిగ్విజయంగా పూర్తి చేసి సీక్రెట్ టాస్క్ లో గెలిచింది. కెప్టెన్సీ రేస్ లో నిలిచింది. పల్లెకి పోదాం ఛలో టాస్క్ లో మల్లీ అనే క్యారెక్టర్ లో జీవించిందనే చెప్పాలి. ముఖ్యంగా అమ్మరాజశేఖర్ పై కాఫీ చల్లిన విధానం చాలా బాగుంది. చాలా నీట్ గా అక్కడ అందరిలో కలిసిపోయి ఈపని చేసింది. ఇక అవినాష్ కి కోపం తెప్పించేటపుడు హారిక ఎక్కడా తడబడలేదు.

ఒకవైపు అఖిల్ అండ్ మెహబూబ్ ఇద్దరూ గట్టిగట్టిగా అరుస్తున్నా కూడా తన వెర్షన్ లో తను అవినాష్ కి కౌంటర్స్ వేస్తూనే ఉంది. ఫస్ట్ రెండు పాన్స్ కావాలి అంటూ మొదలు పెట్టిన హారిక, తర్వాత అఖిల్ వచ్చి కిళ్లీ కొట్టు పాడుచేస్తుంటే అఖిల్ ని రెచ్చగొట్టింది. దీంతో అవినాష్ ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయాడు. తన కొట్టుని తానే డ్యామేజ్ చేస్కున్నాడు. అంతేకాదు, ఇక్కడ అవినాష్ హారిక వల్లే బాగా డిస్టర్బ్ అయ్యాడు. గొడవ మొత్తం అయిపోయిన తర్వాత కూడా హారికపైన అరిచాడు. తర్వాత సోఫాలో కూర్చున్నట్లుగానే కూర్చుని మెహబూబ్ ని చంపాలి అని గ్లాస్ పైన రాసింది.

దీంతో బిగ్ బాస్ ఇచ్చిన మూడు సీక్రెట్ టాస్క్ లు దిగ్విజయంగా పూర్తి చేసింది. హారిక ఎంత స్మార్ట్ గా గేమ్ ఆడుతోందో ఇప్పుడు ప్రేక్షకులకి అర్ధమైంది. అంతేకాదు, కెప్టెన్సీ రేసులో అరియానా ఇంకా అమ్మ ఇద్దరూ కూడా హారికని టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రోమో రిలీజ్ చేయడంతో ఇప్పడు హారిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాదు, ఈవారం నామినేషన్స్ లో ఉన్న హారికకి ఈ సీక్రెట్ టాస్క్ బాగా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. అభిజిత్ ఓటింగ్ లో దూసుకువెళ్తుంటే , ఇప్పుడు హారిక కూడా గట్టిపోటీ ఇచ్చేలాగానే కనిపిస్తోంది. ఇక టాప్ ఫైవ్ లోకి వెళ్లి వన్ ఆఫ్ ది టైటిల్ ఫేవరెట్ అయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?x

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus