హరీష్ శంకర్ ఆ ఇద్దరు హీరోలకి హ్యాండిచ్చాడా..?

గత కొంత కాలంగా హరీష్ శంకర్ తమిళంలో సూపర్ హిట్టయిన ‘జిగర్తాండ’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ‘జిగర్తాండ’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన బాబీ సింహా పాత్రకు రవితేజను సంప్రదించాడట. రవితేజ కూడా ఈ పాత్రకోసం పాజిటివ్ గానే స్పందించాడంట. ఇక ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ పాత్ర కోసం సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ను సంప్రదించగా.. తేజు కూడా ఓకే అనేశాడట.

అయితే హరీష్ ఇప్పుడు వీరిద్దరినీ కాదని వరుణ్ తేజ్ .. నాగశౌర్యలతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. రవితేజ, సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రాన్ని ఓకే చేసినప్పటికీ.. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా హరీశ్ శంకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల రవితేజ.. సాయిధరమ్ తేజ్ ఫీలవుతున్నట్టు ఫిలింనగర్లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో రవితేజతో ‘షాక్’ ‘మిరపకాయ్’ వంటి చిత్రాలు తెరకెక్కించాడు హరీష్. వీటిలో ‘మిరపకాయ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక తేజు తో కూడా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాలు చేస్తున్నప్పుడే.. రవితేజ, సాయి ధరమ్ తేజ్ లతో మంచి అనుబంధం ఏర్పడింది. మరి హరీష్ ఎందుకు వీరిని పక్కన పెట్టాడా అని ఫిలింనగర్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus