మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ప్రమోషన్లు ఇప్పటివరకు చాలా నీరసంగా జరిగాయి. కాబట్టి.. దానికి కొంచెం జోష్ ను యాడ్ చేయాలని ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్ల టెక్నిక్ వాడారు. అదేంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలను దర్శకుడు రాజమౌళిని మరో టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. దానికి చాలా మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు ‘ఆచార్య’ విషయంలో కూడా అదే చేశారు. ఈ చిత్రంలో నటించిన హీరోలు చిరు, చరణ్ లతో అలాగే దర్శకుడు కొరటాల శివను ఇంటర్వ్యూ చేసే బాధ్యత మన పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు కట్టబెట్టారు.
ఈ ఇంటర్వ్యూ కూడా చాలా సరదాగా సాగింది. హరీష్ తన నైపుణ్యంతో ‘ఆచార్య’ కు సంబంధించి ఆసక్తికర విషయాలను ఈ హీరోల నుండి అలాగే దర్శకుడి నుండి బయటకి రప్పించాడు. అలాగే చిరు కూడా హరీష్ ను వదిలిపెట్టలేదు. ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం నుంచి ఓ డైలాగ్ ను చెప్పాల్సింది గా కోరారు. మెగాస్టార్ అంటే హరీష్ కాదంటాడా.. పైగా మెగాస్టార్ కు హార్డ్ కోర్ ఫ్యాన్ కదా.. మొదట కెమెరాలు ఆపెయ్యండి అని హడావిడి చేసినా ఫైనల్ గా బయటపెట్టాడు.
‘హీరో నడుచుకుంటూ వస్తుంటే వెనుక చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. అప్పుడు విలన్ చూసి కంగారు పడి.. ‘మొన్న ఈడు మన ఇంటికి వచ్చి పెద్దగా అరిచినప్పుడు.. ఏంటి వీడి ధైర్యం అనుకున్నాను.. ఇప్పుడు అర్థమైంది.. వాడు నడిస్తే వెనుక లక్ష మంది వస్తారు…బహుశా ఇదే వాడి ధైర్యం అనుకుంట’….’లేదు సర్ ఆ లక్ష మందికి ఆయన ముందు నడుస్తున్నాడు అనేది ధైర్యం'(అంటూ విలన్ తో పక్కనున్న వ్యక్తి అంటాడు)… అంటూ హరీష్ చెప్పుకొచ్చాడు.
హరీష్ ఈ డైలాగ్ చెప్పిన తర్వాత ఇది ‘మెగా లీక్’ అంటూ చిరు సెటైర్ వేశారు. పనిలో పనిగా చిరు.. ‘నాతో ఎప్పుడు సినిమా అంటే..’, ‘కళ్యాణ్ గారితో అయిపోయిన వెంటనే మీతో చేయాలనుంది’.. అంటూ హరీష్ బదులిచ్చాడు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!