ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతోంది ఇలా ఈ సినిమా ఆలస్యం కావడంతో హరీష్ శంకర్ మరే ఇతర సినిమాలను కూడా ప్రకటించలేదు. ఇలా వేరే సినిమాలకు కమిట్ అవ్వకుండా ఈయన పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్నటువంటి యాడ్స్ కూడా షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇప్పటికే ఈయన పలువురు స్టార్ హీరోల యాడ్స్ షూట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ మరొక యాడ్ చేయడానికి కమిట్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ యాడ్ కి సంబంధించినటువంటి షూటింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో జరిగింది. ప్రస్తుతం ఈ షూటింగ్ కి సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది.
ఇక ఈ ఫోటోని స్వయంగా డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) షేర్ చేయడం విశేషం ఆయన డైరెక్టర్ సీట్లో కూర్చొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో యాడ్ షూటింగ్ జరిగిందని చెప్పకు వచ్చారు. ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ కి సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా అల్లు అర్జున్ మరొక యాడ్ చేయబోతున్నారనే విషయం తెలియడంతో ఈయన ఎలాంటి యాడ్ చేయబోతున్నారు అంటూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా యాడ్స్ ద్వారా కూడా ఈ సెలబ్రిటీలు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇప్పటికే రెడ్ బస్ జొమాటో వంటి వాటికి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!