హరీష్ డైరెక్షన్లో నితిన్, సాయి తేజ్ ల మల్టీ స్టారర్?

యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. త్వరలో పవన్ కళ్యాణ్ తో ఓ చిత్రం తెరకెక్కించనున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా కూడా ఫిక్స్ చేశారు. గతంలో పవన్ – హరీష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్ళీ ఇన్నాళ్టికి ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా.. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.

కేవలం 6 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చెయ్యాలి అని హరీష్ శంకర్ పక్కా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక ఓ మల్టీ స్టారర్ ను చేయబోతున్నాడు హరీష్ అంటూ వార్తలు వస్తున్నాయి. గతేడాది ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని నిర్మించి హిట్ అందుకున్న ’14 రీల్స్’ వారు.. హరీష్ తో మరో చిత్రం చేయబోతున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఒక మల్టీ స్టారర్ అని తెలుస్తుంది. ఒక హీరోగా నితిన్ ను ఫైనల్ చేశారట.

మరో హీరోగా.. మొదట వరుణ్ తేజ్ ను అనుకున్నారట. కానీ ఎందుకో వరుణ్ ఈ ప్రాజెక్ట్ కు ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్ నడుస్తుంది. దీంతో ఇప్పుడు అతని ప్లేస్ లో మెగా మేనల్లుడు సాయి తేజ్ ను తీసుకోబోతున్నట్టు సమాచారం. గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే చిత్రం చేసాడు సాయి తేజ్. దాదాపు ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టే అని తెలుస్తుంది. ఎక్కువ శాతం ఇది కూడా రీమేక్ అని కూడా టాక్ నడుస్తుంది. మరి ఆఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus