Harom Hara Trailer Review: నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో సుధీర్ బాబు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

సుధీర్ బాబు (Sudheer Babu) కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైం ఇది. గత ఏడాది అతను హీరోగా తెరకెక్కిన ‘హంట్’ (Hunt) ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra) సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. సినిమా కోసం అతను ఎంతైనా కష్టపడతాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉండగా.. త్వరలో సుధీర్ బాబు ఓ పాన్ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే ‘హరోం హర’ (Harom Hara) . ‘సెహరి’ (Sehari) ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) ఈ చిత్రానికి దర్శకుడు.

ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు (Sumanth G Naidu) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. 2 నిమిషాల 47 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. 1989లో చిత్తూరు జిల్లా, కుప్పంలో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఓ పీరియాడికల్ క్రైమ్ డ్రామా అని స్పష్టమవుతుంది.

ఇందులో సుధీర్ బాబు గన్నులు తయారు చేసి ధనవంతుడు అయ్యే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతని పక్కనే ఉండే సునీల్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుధీర్ బాబు ఈ చిత్రంలో మాస్ అవతార్ లో కనిపించబోతున్నట్టు ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ట్రైలర్లో ఆకట్టుకునే అంశాలు. జూన్ 14 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus