Harris Jayaraj: ఆరెంజ్ సంగీత దర్శకుడు.. మళ్ళీ ఇన్నాళ్లకు

తమిళ సంగీత స్వరకర్త హారిస్ జైరాజ్ గతంలో ఎలాంటి మ్యూజిక్ అందించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని తమిళ చిత్రాలు కూడా తెలుగులో డబ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తెలుగులో వాసు, ఘర్షణ వంటి సినిమాలతో సంగీతాన్ని అందించి బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా ఆరెంజ్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చివరగా స్పైడర్ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ తెలుగు హీరోలు అతనితో సినిమా చేయలేదు.

ఇక మళ్ళీ ఇన్నాళ్లకు హరిస్ జై రాజ్ తెలుగు సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. మొదటిసారి నితిన్ చిత్రం కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ‘అపరిచితుడు’ మ్యూజిక్ కంపోజర్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అభిమానులు ప్రశ్నించినప్పుడు నితిన్ తదుపరి చిత్రానికి తాను సంగీతం అందిస్తున్నట్లు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో వెల్లడించాడు. ‘కిక్’ కథ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.

‘కిక్’, ‘రేస్ గుర్రం’, ‘సింబా’ మరియు అఖిల్ అక్కినేనితో రాబోయే ‘ఏజెంట్’ వంటి చిత్రాలకు కథను అందించిన వంశీ మొదట నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలువగా మరో సినిమా అవకాశం కోసం చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇక 2021లో చెక్, ‘రంగ్ దే’ మరియు ‘మాస్ట్రో’ అనే సినిమాలతో అపజయాలను చూసిన నితిన్ తన తదుపరి మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు, దీనికి MS దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక కృతి శెట్టి & కేథరిన్ త్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే వక్కంతం వంశీ సినిమాపై నితిన్ ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఆ సినిమా యూనిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా హారిస్ జై రాజ్ ను ఫైనల్ చేసింది. మరి హీరోయిన్స్ గా ఎవరు కనిపిస్తారో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus