Harsha Sai: స్టార్ హీరోలకు హర్షసాయి గట్టి పోటీ ఇస్తారా.. మూవీ ప్రకటన ఎప్పుడంటే?
- September 14, 2023 / 10:40 AM ISTByFilmy Focus
యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులరిటీని కలిగి ఉన్న సెలబ్రిటీలలో హర్షసాయి ఒకరు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన డబ్బును హర్షసాయి కష్టాల్లో ఉన్నవాళ్ల కోసం ఖర్చు చేయడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. హర్షసాయి తన యూట్యూబ్ ఛానల్ లో తక్కువ వీడియోలను మాత్రమే పోస్ట్ చేసినా ఆ వీడియోలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
కొంతమంది హర్షసాయి గురించి నెగిటివ్ కామెంట్లు చేసినా హర్షసాయి మాత్రం ఆ నెగిటివిటీని పెద్దగా పట్టించుకోలేదు. అయితే హర్షసాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని గతంలో ప్రచారం జరగగా తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని హర్షసాయి గతంలో ప్రకటించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం హర్షసాయికి యూట్యూబ్ ఛానెళ్లు ఉండగా ఆ ఛానెళ్లకు కూడా ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

అయితే హర్షసాయి హీరోగా సినిమా తెరకెక్కుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 17వ తేదీన ఈ మూవీ టైటిల్ ను ప్రకటించడంతో పాటు టీజర్ ను లాంఛ్ చేయనున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్ర శర్మ, సీఎం కేసీఆర్ బంధువు కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం అందుతోంది.

హైదరాబా లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఈవెంట్ జరగనుంది. మిత్ర శర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్ తో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. హర్షసాయి సినిమాల్లో సక్సెస్ కావడంతో పాటు స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Our Next PAN INDIA PROJECT
Further Details Very Soon #ShreePictures #HarshaSai pic.twitter.com/iCOWp0VISX— Mitraaw (@Mitraaw_sharma) September 13, 2023












