రైటర్స్… డైరెక్టర్స్ గా మారడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న త్రివిక్రమ్, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్లు ఒకప్పుడు రైటర్స్ గానే పనిచేశారు. పక్క దర్శకులకు డైలాగ్ వెర్షన్ ఇచ్చి.. వాళ్ళు ఇచ్చే కొంత మొత్తం తీసుకోవడంలో గ్రోత్ ఉండదు అని భావించి.. డైరెక్టర్లుగా మారాలని ప్రతి ఒక్క రైటర్ పనిచేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఎంతో మంది స్టార్ రైటర్స్… తెర వెనుక ఉండి కథని నడిపిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. దర్శకులుగా మారినంత మాత్రాన ప్రతి రైటర్ సక్సెస్ అవుతాడా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా వక్కంతం వంశీని చెప్పుకోవచ్చు.ఇతను చాలా హిట్ సినిమాలకి పనిచేశాడు. కానీ డైరెక్టర్ గా మారి తీసిన ‘నా పేరు సూర్య’ పెద్ద ప్లాప్ అయ్యింది. రెండో సినిమాకి పెద్ద హీరోని పట్టలేక ఫైనల్ గా నితిన్ తో ఓ సినిమా చేశాడు. ఇతని బాటలోనే హర్షవర్ధన్ కూడా నడుస్తున్నాడు అని అర్థమవుతుంది.
స్వతహాగా రైటర్ అయినప్పటికీ.. నటుడిగా పాపులర్ అయ్యాడు. తర్వాత మళ్ళీ రైటర్ గా మారి ‘మనం’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి హిట్ సినిమాలకి పనిచేశాడు. అయితే డైరెక్టర్ గా మారి ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఇది డిజప్పాయింట్ చేసింది. అంతకు ముందు తీసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా రిలీజ్ కి నోచుకోలేదు.
దీంతో ఇప్పుడు మళ్ళీ రైటర్ గా వేరే సినిమాలకి పనిచేయాల్సి వస్తుంది. అలాగే కాస్త క్రేజ్ ఉన్న హీరో కాల్షీట్లు పట్టి.. నిర్మాతల వద్దకు వెళ్లడానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంతేకాదు నితిన్ తో టచ్ లో ఉంటున్నాడట. నితిన్ కి హర్షవర్ధన్ (Harsha Vardhan) పై నమ్మకం ఉంది. చూడాలి మరి ఛాన్స్ ఇస్తాడో లేదో
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు