Harshaali Malhotra: ‘భజరంగీ..’ చిన్నారీ టీనేజ్‌లోకి వచ్చేసిందట

‘భజరంగీ భాయిజాన్‌’లో మున్నీ గుర్తుందా? అయ్యో ఎందుకు గుర్తులేదు. మూగ చిన్నారిగా ఇరగ్గొట్టేసింది అంటారా. అప్పుడు చిన్నారే… కానీ ఇప్పుడు టీనేజర్‌. అవును సల్మాన్‌ ఖాన్‌తో పోటీపడి మరీ నటించిన మున్నీ అలియాస్‌ హర్షాలీ మల్హోత్రాకి 13 ఏళ్లు వచ్చేశాయి. దీంతో చిన్నారి కాస్త టీనేజర్‌గా మారింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేసింది. కేక్‌ మీద ఇప్పుడు అఫీషియల్లీ టీనేజర్‌ అని రాసుంది.

‘భజరంగీ భాయిజాన్‌’తో వెండితెరకు పరిచయమైన హర్షాలీ తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో ఆమె నటనకు ఫిదా కాని వారుండరు. అంతవరకు అమాయకమైన ముఖంగా మూగబాలికగా మురిపించిన హర్షాలీ… ఆ తర్వాత క్లైమాక్స్‌కు వచ్చేసరికి తన నటనతో ఫిదా చేసేసింది. గొంతు వచ్చే సన్నివేశం, ఆ తర్వాత పరుగు అన్నీ అలా గుర్తొండిపోతాయి. అయితే ఆ సినిమా తర్వాత హర్షాలీ మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ‘నాస్తిక్‌’ అనే ఓ సినిమాకు ఇటీవల ఓకే చెప్పింది.

2015లో సినిమాల్లోకి వచ్చే ముందే 2012లో హర్షాలీ కొన్ని టీవీ సీరియల్స్‌లో మెరిసింది. ‘ఖుబూల్‌ హై’, ‘లాట్‌ ఆవో త్రిషా’, ‘సావ్‌దాన్‌ ఇండియా’షోస్‌లో కనిపించింది. అయితే మళ్లీ టీవీ వైపు కూడా వెళ్లలేదు. చదువు మీద దృష్టిసారించింది. ఇప్పుడు టీనేజర్‌ అయ్యింది కాబట్టి… ఏమన్నా సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి. ఈ లోగా అప్పటి మున్నీ, ఇప్పటి మున్నీ ఫొటోలను చూసేయండి మరి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus