సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజు నోటీసులు అందించింది. ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిలిపివేయాలంటూ నలుగురు నిందితుల కుటుంబసభ్యులు హైకోర్టుని ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని.. ఇలాంటి సమయంలో వర్మ సినిమాను నిర్మించి వారిని కనీసం ఊరిలో ఉండనివ్వకుండా చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకి వివరించారు.
చేయని తప్పుకి నిందితుల కుటుంబ సభ్యులను దోషులుగా నిలిపే పరిస్థితిని వర్మ తీసుకొస్తున్నారనిన్యాయవాది కోర్టుకి వినిపించారు. ఈ సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దిశ సంఘటనపై ఒక పక్క జ్యుడిషినల్ కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలో అసలు సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. వెంటనే సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై,
బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరోపక్క ఈ నెల 26న సినిమాను విడుదల చేయడానికి వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?