Jr NTR: హెచ్సీఏ షాకింగ్ ట్వీట్.. ఎన్టీఆర్ అందుకోలేదంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి సినిమా ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు. సింగిల్ టేక్ లో ఎంత కష్టమైనా సన్నివేశంలోనైనా నటించడం జూనియర్ ఎన్టీఆర్ కు సాధ్యమని చాలామంది భావిస్తారు. ఈరోజు ఉదయం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ లకు అవార్డ్ పంపిస్తున్నట్టు ట్వీట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ పేర్లతో ఉన్న ట్రోఫీల ఫోటోలను చేస్తూ అవార్డుల బృందం ట్వీట్ చేయగా ఆ ట్వీట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

ఈ ఫోటోల గురించి అవార్డుల గురించి సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ ఒక భారతీయ సినిమాకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు ఇవ్వడం ఇదే చివరిసారి కావచ్చని కొందరు అభిమానులు అనవసరంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ కు మరిన్ని అవార్డులు రావాలని ఆ అభిమాని ట్వీట్ చేయడం గమనార్హం. ఆ కామెంట్ గురించి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పందిస్తూ ఆయనకు ఎప్పుడూ అవార్డులు వస్తూనే ఉంటాయని ఉంటాయని కాకపోతే ఆ అవార్డును ఆయన వ్యక్తిగతంగా అందుకోలేకపోయారని పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇకపై ఏ ఈవెంట్ జరిగినా హాజరు కావాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ కు సంబంధించి త్వరలో ఆసక్తికర అప్ డేట్ రానుందని తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. తారక్ కు జోడీగా జాన్వీ కనిపించనుండగా ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోషూట్ పూర్తైందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్30 సెట్స్ పనులు జరుగుతుండగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ తారక్ కెరీర్ లో మెమరబుల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus