బాలకృష్ణ 103 వ సినిమా డైకర్టర్ అతనే

యువ హీరోల మాదిరిగా నందమూరి బాలకృష్ణ పరుగులు తీస్తున్నారు. వంద తర్వాత వన్, టు, ట్రీ అంటూ చకచకా సినిమాలు చేస్తున్నారు. పైసా వసూల్ తర్వాత తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శ కత్వంలో బాలకృష్ణ చేస్తున్న ‘జై సింహా’ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి అయింది. ఈ సినిమాని జనవరి 13 న విడుదల చేయడానికి నిర్మాత సి కళ్యాణ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ చేయాల్సి ఉంది. అయితే తేజ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. పైగా బయోపిక్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. సో ఈ గ్యాప్ లో మరో మూవీ చేయాలనీ బాలయ్య ప్రయత్నిస్తున్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డితో 103 వ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలకృష్ణ ‘అంతరిక్ష యాత్రికుడు’గా కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ కథను బాలకృష్ణ పక్కన పెట్టినట్లు తెలిసింది. యువ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికే బాలకృష్ణ నిర్ణయించుకున్నాడనేది తాజా సమాచారం. బాలకృష్ణ 100 వ సినిమా సమయంలోనే అనిల్ రావిపూడి ఆయనకి కథ వినిపించారని, కానీ అప్పుడు బాలకృష్ణ “గౌతమి పుత్ర శాతకర్ణి” పనులతో బిజీగా ఉండడం వాళ్ళ చేయలేక పోయారని.. ఇప్పుడు సమయం దొరకడంతో సై అన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా వివరాలు త్వరలో అధికారికంగా బయటికి రానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus