Bobby: డాకూ మహరాజ్ తర్వాత బాబీ ప్లాన్ ఏంటి?

దర్శకుడు బాబీకి (K. S. Ravindra) వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమా హిట్ తర్వాత మంచి బూస్ట్ అందినప్పటికి, డాకూ మహరాజ్ (Daaku Maharaaj) సినిమాతో అదే స్థాయి విజయాన్ని కొనసాగించడం తేలిక కాలేదు. ఫస్ట్ హాఫ్ టెక్నికల్‌గా బాగానే ఉన్నప్పటికీ, సెకండాఫ్ రైటింగ్ విషయంలో కొంత వెనకబడినట్లు టాక్ వచ్చింది. ఈ కారణంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో మరింత బలంగా ఉండే అవకాశం వదులుకున్నట్లు అనిపించింది. కానీ బాబీ టేకింగ్, ఫన్ ఎలిమెంట్స్ ఓ వర్గం ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి.

Bobby

ఇక డాకూ మహరాజ్ తర్వాత బాబీ కొత్త ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొదట మెగాస్టార్ చిరంజీవితోనే (Chiranjeevi) మరో సినిమా ప్లాన్ చేశారని టాక్ వచ్చింది. అయితే, కథ సిద్ధం కాకపోవడం, చిరంజీవి ఇతర ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఈ కాంబినేషన్ పక్కన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడితో (Anil Ravipudi)  చేస్తున్న సినిమాపై ఫోకస్ పెట్టగా, బాబీ (Bobby) కొత్త హీరో కోసం వెతుకుతున్నారన్నది తాజా సమాచారం.

ఇకపోతే, టాప్ హీరోలందరూ బిజీగా ఉండటంతో బాబీకి రవితేజనే (Ravi Teja) ప్రాధాన్యతగా కనిపిస్తోంది. రవితేజతో పవర్ అనే సినిమాత కమర్షియల్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ చొరవతో మరో ఛాన్స్ రావచ్చు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా త్వరలో పూర్తవుతుండటంతో, బాబీ తన స్క్రిప్ట్‌ను రవితేజకు సెట్ చేయగల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవితేజతో మరో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించే ఆలోచనలో బాబీ (Bobby) ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా, ఒకవేళ టాప్ రేంజ్ హీరోలతో పనిచేయాలన్న బాబీ ఆశ ఉన్నట్లయితే, కనీసం ఏడాది పాటు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ (Jr NTR), వెంకటేష్(Venkatesh Daggubati) , రామ్ చరణ్ (Ram Charan)వంటి స్టార్లు తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మొత్తానికి, బాబీకి డాకూ మహరాజ్ తర్వాత టాప్ లీగ్‌లో నిలవాలంటే తన రైటింగ్, స్క్రిప్ట్ సెలక్షన్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రవితేజతో ప్రాజెక్ట్ సెట్ చేస్తారా, లేక కొత్త హీరోల కోసం ఎదురు చూస్తారా అనేది చూడాలి.

96 చైల్డ్ ఆర్టిస్ట్.. గ్లామర్ లుక్కులో అరాచకం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus