కె.విశ్వనాథ్‌ నుండి వచ్చిన ఐదు అద్భుతమైన సినిమాల ప్రత్యేకతలు!

  • February 3, 2023 / 08:05 PM IST

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినిమాల్లో గొప్ప సినిమాల గురించి చెబుదాం అని ట్రై చేస్తే.. అన్నీ గొప్పగానే కనిపిస్తాయి. అందుకే ఆయన సినిమాల్లో అత్యుత్తమ చిత్రాలుగా పురస్కారాలు అందుకున్న ఓ ఐదు సినిమాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అప్పటి సినిమాలను ఇప్పుడు వివరించి చెప్పడం అంత సులభం కాకపోయినా.. మా ప్రయత్నం మేం చేస్తున్నాం.

* కమర్షియల్‌ హంగులు లేకుండా సంగీత ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ‘శంకరాభరణం’. 1980లో విడుదలైన ఈ సినిమా సాధించిన విజయాన్ని మాట్లలో చెప్పలేం, అక్షరాల్లో రాయలేం. రెండో వారం నుండి అందుకున్న వసూళ్ల జోరు.. నెలల తరబడి కొనసాగింది అని చెప్పాలి. ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కె.వి. మహదేవన్‌ (ఉత్తమ సంగీత దర్శకుడు),ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( ఉత్తమ గాయకుడు), వాణీ జయరామ్‌ (ఉత్తమ గాయని) అవార్డులు వచ్చాయి.

* కుల వ్యవస్థను చెరిపివేయాలని చాటి చెప్పిన చిత్రాల్లో ‘సప్తపది’ ఒకటి. వివాహం నేపథ్యంలో సంగీత ప్రధానంగా సాగే ఈ సినిమా 1981లో విడుదలైంది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ‘నర్గీస్‌దత్త్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్’ పురస్కారం లభించింది.

* చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీకి మళ్లీ వివాహం చేయాలనే ఆలోచన రేకెత్తించిన చిత్రం ‘స్వాతిముత్యం’ . కమల్‌ హాసన్‌లోని నటుణ్ని పీక్స్‌లో చూపించిన సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమా తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు గెలుచుకుంది.

* అవినీతి, అక్రమాలను ఎదుర్కోవడానికి శాంతియుత మార్గమే ఉత్తమమని చాటి చెప్పిన సినిమా ‘సూత్రధారులు’. 1989లో విడుదలైన ఈ సినిమాకు ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ (తెలుగు)… జాతీయ అవార్డు దక్కింది.

* సంగీత ప్రధానంగా వచ్చిన గొప్ప చిత్రాల్లో ‘స్వరాభిషేకం’ ఒకటి. 2004లో వచ్చిన ఈ సినిమాకు ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ (తెలుగు) కేటగిరిలో జాతీయ అవార్డు అందుకుంది. విద్యాసాగర్‌ (ఉత్తమ సంగీత దర్శకుడు) కూడా పురస్కారం సాధించారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus