Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకీ పెరుగుతున్న ఈ కాలంలో, నిజం కావాల్సిన విషయాలు పక్కదారి పడుతుంటే… అబద్ధాలు మాత్రం అద్భుతంగా ప్రచారం పొందుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న ఫోటో బయటికి వచ్చినా, వెంటనే దానికి అనేక కథనాలు జతవుతూ వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)   ఎత్తుకుని ఉన్న ఓ చిన్నారి ఫోటోకు సంబంధించిన విషయమూ ఇదే తరహాలో నెట్టింట హల్చల్ చేసేసింది. చిరంజీవితో కనిపించిన చిన్నారి ఎవరో కూడా తెలియకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమెను రామ్ చరణ్ (Ram Charan)  – ఉపాసనల కుమార్తె క్లిన్ కారా అని ప్రచారం మొదలైంది.

Chiranjeevi

ఫోటో చూసిన కొందరు మెగా అభిమానులు ఆనందంతో షేర్ చేస్తుండగా, మరికొంతమంది మాత్రం తను క్లిన్ కారా కాదని ఖండించారు. అసలు ఆ ఫోటో 2021లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తీసినదని, అందులో ఉన్న చిన్నారి చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ కుమార్తె నవిష్క అని క్లారిటీ ఇచ్చారు. నవిష్క కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా, అప్పట్లో తన పేరుతో ఉన్న ఒక అకౌంట్ ద్వారా ఈ ఫోటోను షేర్ చేసినట్టు తెలుస్తోంది.

చిరంజీవి కుటుంబంతో కలిసి ఎక్కువగా కనిపించే ఈ చిన్నారి అప్పట్లోనే అభిమానుల దృష్టిలోకి వచ్చింది. కానీ తాజాగా అదే ఫోటోను క్లిన్ కారా అని చుట్టూ పెట్టడం మరోసారి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రభావాన్ని బయటపెట్టింది. ఇప్పటివరకు రామ్ చరణ్ – ఉపాసన తమ కుమార్తె ముఖాన్ని పబ్లిక్ గా చూపించలేదు.

వారు ప్రైవసీని కాపాడుతున్న తీరును మెగా ఫ్యాన్స్ గౌరవిస్తున్నారు. ఓపెన్ ప్లాట్‌ఫామ్స్‌లో క్లిన్ కారా ఫోటోలు తీయకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో ‘అన్‌స్టాపబుల్’ షోలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ “ఆ పాప నన్ను ‘నాన్నా’ అని పిలిచిన రోజే, ఆమెను ప్రపంచానికి పరిచయం చేస్తాను” అని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది.

బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus