Hrithik Roshan: ప్రపంచానికి మీ లాంటి వారు కావాలి: హృతిక్‌ రోషన్‌

బాలీవుడ్‌లో కండల వీరుడు అంటే వినిపించే హీరోల పేర్లలో హృతిక్‌ రోషన్‌ ఒకరు. నిజానికి ఆయన కండల వీరుడు మాత్రమే కాదు. ఆయనను గ్రీక్‌ గాడ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ అని కూడా అంటారు. శరీర సౌష్టవం, అందం, లుక్‌ అన్నీ గ్రీక్‌ గాడ్‌లా ఉంటాయని చెబుతుంటారు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ అదే ఫిజిక్‌ మెయింటైన్‌ చేస్తూ వస్తున్నాడు హృతిక్‌. అయితే తాజాగా తన బాడీ ఫిట్‌గా ఉండటానికి, తాను కండల వీరుడిగా కనిపించడానికి కారణమైన వ్యక్తిని హృతిక్‌ తన అభిమానులకు పరిచయం చేశాడు.

‘వార్’, ‘విక్రమ్ వేదా’ సినిమాల ద్వారా ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి విజయాలు అందుకున్నాడు హృతిక్‌ రోషన్‌. త్వరలో ‘ఫైటర్‌’ సినిమా కోసం బరిలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా కోసం తన శరీరాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. సినిమా పేరులోనే సినిమా జానర్‌ తెలిసిపోతోంది కాబట్టి.. ఎందుకు ఫిట్‌నెస్‌ మీద మరింత దృష్టి పెట్టాడు అనే విషయంలో మరోసారి ప్రత్యేకమైన చర్చ అవసరం లేదు. నిజానికి హృతిక్‌ సినిమాలతో సంబంధం లేకుండా ఫిట్‌గానే ఉంటాడు అనుకోండి.

‘ఫైటర్’ సినిమాలో పర్‌ఫెక్ట్‌ ఫైటర్‌ బాడీ కోసం హృతిక్‌ ఇంకాస్త అదనపు కసరత్తులు చేశాడు. ఈ క్రమంలో తనకు ట్రైనింగ్ ఇచ్చిన జిమ్ ట్రైనర్ క్రిస్ గెతిన్ తిరిగి తన సొంత దేశానికి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ఆయనని ఉద్దేశించి హృతిక్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పని పట్ల శ్రద్ధ, నిబద్దత కలిగిన మీ లాంటి వారిని చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది. నిజానికి ప్రపంచానికి మీ లాంటి వారే కావాలి, మీకోసం ఎదురుచూస్తుంటాను’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు హృతిక్‌.

హృతిక్‌ పోస్ట్‌కు క్రిస్‌ గెతిన్ స్పందించాడు కూడా. ‘హృతిక్.. ది ఫైటర్’ అంటూ రిప్లై కూడా ఇచ్చాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘ఫైటర్‌’లో కథానాయికగా దీపికా పడుకొణె నటిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus