Manchu Vishnu: మా ఎన్నికల కోసం మంచు విష్ణు పవర్ఫుల్ ప్యానెల్!
- September 23, 2021 / 12:36 PM ISTByFilmy Focus
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న విషయం తెలిసిందే. ఇక అసలైన అభ్యర్థులు వారి ప్యానెల్ మెంబర్స్ పేర్లను తెలియజేశారు. మా పదవికి ప్రధాన పోటీదారు అయిన ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ఇప్పటికే ప్రకటించడంతో ఇప్పుడు ప్రత్యర్థి పోటీ దారుడు విష్ణు మంచు కూడా తన ప్యానెల్ పేర్లను వెల్లడించాడు. ఇక ఈ రోజు విష్ణు తన వైపు ఉన్న సభ్యుల గురించి అధికారిక ప్రకటన చేశాడు.
మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు పోటీ చేయనున్న విషయం తెలిసిందే. రఘు బాబు – ప్రధాన కార్యదర్శి, బాబు మోహన్-కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా అలాగే మాధాల రవి & 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ బాల్రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఫొటోలోకి వచ్చారు. ఇక శివ బాలాజీ – ట్రెజరర్ గా, కరాటే కళ్యాణి & గౌతమ్ రాజు – జాయింట్ సెక్రటరీగా పోటీకి సిద్ధమవుతున్నారు.

ఎక్సిక్యూటివ్ మెంబెర్స్: అర్చన (వేద), అశోక్ కుమార్, గీతా సింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ నరిపెద్ది, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు పి, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, మరియు వడ్లపట్ల MRC వంటి వారు ఎన్నికల్లో ఉన్నారు. మంచు విష్ణు కీలక స్థానాలకు సీనియర్ నటులను తన ప్యానెల్‌లో ఉండేలా చూసుకున్నాడు. ఇక అతను ఎన్నికల్లో విజయం సాధించడంపై ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అలాగే అసోసియేషన్ కోసం శాశ్వత కార్యాలయాన్ని నిర్మించడమే అతని ప్రధాన ఎజెండాగా తెలియజేసిన విషయం తెలిసిందే.
For my MAA, our privilege and honor 🙏 pic.twitter.com/Ow3Cdrvsec
— Vishnu Manchu (@iVishnuManchu) September 23, 2021
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?














