Guntur Kaaram: ‘గుంటూరు కారం’ విషయంలో ఓల్డ్‌ రూమర్‌కి ఇదిగో క్లారిటీ!

ఇప్పుడు ‘గుంటూరు కారం’ కానీ.. ఒకప్పుడు ఈ సినిమా పేరు కోసం చాలా పెద్ద ఎత్తున చర్చలే జరిగాయి. దానికి కారణం ఒకటి త్రివిక్రమ్‌ ‘అ’ సెంటిమెంట్ అయితే, రెండోది ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేం దేని గురించి చెప్పబోతున్నామో. అవును అదే ‘అమరావతికి అటు ఇటు’. మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాకు ఈ టైటిల్‌ దాదాపు పెట్టేశారు అనే చర్చ సాగింది. అయితే ఏమైందో ఏమో ఆఖరికి ‘గుంటూరు కారం’ అనే టైటిల్‌ ఫిక్స్ చేసి బయటకు వదిలారు.

అయితే, అప్పుడు ఏం జరిగింది అనే విషయంలో చిన్నపాటి క్లారిటీ వచ్చింది. అప్పుడు ఈ టైటిల్‌ ఎందుకు అనుకున్నారు? ఎందువల్ల మానేశారు అనే వివరాలు చూచాయగా తెలుస్తున్నాయి. పైన చెప్పినట్లు ఈ సినిమాకు ఫస్ట్ నుండి ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ అనుకున్నారు. సినిమా కథ కూడా అమరావతి పరిసరాల్లో జరుగుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఆ టైటిల్‌ బాగుంటుంది అని లెక్కలేశారు. టైటిల్ కూడా క్యాచీగా ఉండటం, త్రివిక్రమ్‌ ఎక్కువ నమ్మే ‘అ’ సెంటిమెంట్‌ కూడా ఉండటం ఇక్కడ కీలకంగా మారింది.

సినిమాలో మహేష్ పాత్ర తల్లిదండ్రులు విడిపోయి అమరావతి పరిసరాల్లో విడివిడిగా ఉంటారట. అందుకే ‘అమరావతికి అటు ఇటు’ అనే పేరు అనుకున్నారని టాక్‌. ఈ చిత్రంలో వినోదం, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. మహేష్ పూర్తిగా ఎనర్జిటిక్‌గా మాస్ తరహాలో ఉంటుందట. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు మొత్తం అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో ఆ పేరు వద్దనుకున్నారట. దీంతో గుంటూరు పరిసర ప్రాంతాల సినిమా కాబట్టి.. అక్కడి ఫ్లేవర్‌ తెలిసేలా ఆ పేరు పెట్టారు అని టాక్‌.

ఇక ఈ సినిమా (Guntur Kaaram) సంగతి చూస్తే.. మొన్నీమధ్య వచ్చిన టైటిల్‌ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మరో నాయిక కూడా ఉంటుంది అని సమాచారం. త్వరలోనే ఆ పాత్రపై క్లారిటీ వస్తుంది అంటున్నారు. అయితే ఈలోపు త్రివిక్రమ్‌ ‘బ్రో’ను రిలీజ్‌ చేసి రెడీ అవుతారట.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus