కమర్షియల్ సినిమాకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలి అంటూ ఓ లిస్ట్ రాసుకునే ఆలోచన ఏదైనా వస్తే.. అనిల్ రావిపూడి దగ్గర ఇన్‌స్టంట్‌గా ఉంటుంది తీసేసుకోండి. ఆయన చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. మాస్ కమర్షియల్ స్టార్ హీరోలకు సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటున్నారాయన. ఆయన నుండి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’.
వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది అని అంటున్నారు అంతా. దీని వెనుక చాలా కథలు ఉన్నాయని చెబుతున్నా.. ట్రోలర్స్ పేరుతో సోషల్ మీడియాలో విరుచుకుపడే హేటర్స్ మాత్రం సినిమాను సంక్రాంతికి ఎలాగైనా దింపాలని ప్లాన్ చేసి ఆ టైటిల్ పెట్టారు అని అంటున్నారు. అసలు కారణం ఏంటో ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడినే చెప్పారు.
వెంకటేశ్ ఇద్దరు మహిళల మధ్య నలిగిపోతూ కష్టాలు పడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటారు. మేమూ అదే ప్రయత్నం చేస్తున్నాం. అలా చేస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ప్రకటించగానే సంక్రాంతి రిలీజ్ కోసమే ఈ టైటిల్ పెట్టామని అనుకున్నారు. కానీ, టైటిల్‌కు, కథకూ చాలా సంబంధం ఉంది. సినిమా కథలోనే సంక్రాంతి ఉంటుంది. పండగకు నాలుగు రోజుల ముందు జరిగే కథ ఈ సినిమా. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతోనే పేరు అలా పెట్టాం అని చెప్పారు.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఎక్స్‌లెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ మధ్య నలిగిపోయే ఓ ఎక్స్ పోలీసు ఆఫీసర్ కథ ఇది. ఓ మిషన్ మీద ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను ఓ పోలీసు అధికారిణి కలుస్తుంది. విషయం తెలుసుకున్నాక ఎక్స్ కాప్, ఎక్స్‌లెంట్ వైఫ్ ఏం చేశాడు. ఆఖరికి మాజీ గర్లఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్ దగ్గర శాశ్వతంగా ఉండిపోవాలని ఎందుకు అనుకుంది అనేదే కథ అని అంటున్నారు. విషయం తేలాలి అంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాలి.+