Vishal: విశాల్‌ అనారోగ్యం… స్పందించిన మాజీ స్నేహితురాలు.. ఏమందంటే?

ఇటీవల తెలుగు, తమిళ సినిమా మీడియా, సంబంధిత సోషల్‌ మీడియా ఎక్కువగా మాట్లాడుతున్న అంశాల్లో విశాల్‌ అనారోగ్యం ఒకటి. తన 12 ఏళ్ల క్రితం సినిమా ‘మద గజ రాజా’ను ఇన్నేళ్లకు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రెస్‌ మీట్‌కు వచ్చిన విశాల్‌ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించాడు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్‌ మాజీ ‘స్నేహితురాలు’ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ స్పందించింది.

Vishal

‘మద గజ రాజ’ సినిమా ప్రచారంలో భాగంగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశాల్‌ ఆరోగ్యం గురించి స్పందించింది. అభిమానుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వరలక్ష్మి చెప్పింది. విశాల్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తలు చూశాను. ఆయన వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నారు అని ఆమె చెప్పారు.

‘మద గజ రాజ’ తన కెరీర్‌లో రెండో చిత్రమని, సినిమా షూటింగ్‌ సమయంలో దర్శకుడు సుందర్‌.సి తనకు చాలా సపోర్ట్‌ చేశారని వరలక్ష్మి చెప్పారు. సినిమా షూటింగ్‌ సమయంలో సరదాగా గడిపాను. వర్క్‌ విషయంలో సుందర్‌.సి సాయం చేశారని, యాక్టింగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు నేర్పించారని కూడా ఆమె చెప్పారు. విశాల్‌ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆమె తెలిపారు.

విశాల్‌ ఈ సినిమా 8 ప్యాక్‌ బాడీతో కనిపిస్తాడని, ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ప్రేక్షకులు తప్పకుండా తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నా అని కూడా చెప్పింది. ‘మద గజ రాజ’ సినిమాలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కథానాయికలుగా నటించారు. 12 ఏళ్ల క్రితమే సినిమా పూర్తయినా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

మరోవైపు విశాల్‌ విషయంలో అభిమాన సంఘం కూడా స్పందించింది. ఈ విషయంలో లేనిపోని పుకార్లు వద్దని చెప్పారు. ఇక విశాల్‌ దిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని, ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. విశాల్‌ డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోతున్నా.. సినిమా కోసం ఆయన బయటకు వచ్చారని కుష్బూ ఇటలీవల చెప్పిన సంగతి తెలిసిందే.

స్టేజీ మీద ఏవేవో మాటలు.. క్షమాపణ చెప్పిన దిల్‌ రాజు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus