ఫిబ్రవరి 14, ఉదయం 9.18 నిమిషాలన వాలెంటైన్స్ డే సందర్భంగా రాధేశ్యామ్ గ్లిమ్ప్స్ విడుదల..

రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి14 ఉదయం 9.18 నిమిషాలకు రాధే శ్యామ్ గ్లిమ్ప్స్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో రొమాంటిక్ గా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. టీజర్ కూడా పూర్తిగా రొమాంటిక్ గానే ఉండబోతుంది.

రెబ‌ల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus