నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘అఖండ’ (Akhanda) అప్పటికి బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. దానికి సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మహా కుంభమేళలో ఒక షెడ్యూల్ కూడా నిర్వహించారు. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ హాఫ్ కే.. ప్రేక్షకులు టికెట్ కి పెట్టిన మొత్తానికి సంతృప్తి లభిస్తుంది అంటూ ఇటీవల ఓ వేడుకలో సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే ఇందులో విలన్ గా ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) నటిస్తున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. దానిపై ఆది క్లారిటీ ఇచ్చాడు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ” ‘అఖండ 2’ అప్పుడే ఏం మాట్లాడలేం. అయినప్పటికీ ఒక షెడ్యూల్ అయ్యింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. బోయపాటి గారు- బాలయ్య గారి కాంబినేషన్ గురించి మనకందరికీ తెలుసు. వాళ్ళ కాంబో అంటే ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది. అందులో నేను కూడా భాగం అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది.
ఫస్ట్ షెడ్యూల్ చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. నేను చిన్నప్పుడు ‘బంగారు బుల్లోడు’ షూటింగ్ కి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారిని మొదటిసారి కలిశాను. దాని తర్వాత మళ్ళీ ‘అఖండ 2’ కోసమే కలిశాను. అప్పుడు ఆయనలో ఎంత ఫన్, ఎంత ఎనర్జీ ఉండేవో .. ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ కోసం కూడా నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
అఖండ 2 లో బాలయ్య బాబు తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే.?#Akhanda2 #Adhi #Nani #Sabdham pic.twitter.com/GO2pSThDQL
— Filmy Focus (@FilmyFocus) February 21, 2025