టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మార్కెట్ పెరుగుతున్న కొద్దీ రెమ్యునరేషన్ డోస్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు కేవలం థియేట్రికల్ బిజినెస్ ఆధారంగా రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చిన స్టార్స్ ఆ తరువాత ఏరియా రైట్స్ తీసుకునే స్టేజ్ కు వచ్చారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా వరకు రావడంతో అన్ని దారుల్లో కలుపుకొని రెమ్యునరేషన్ హై రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా రానున్న రోజుల్లో మరింత ఆదాయాన్ని అందుకొనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు సంపాదించింది ఒక లెక్క రేపటి నుంచి రాబోయేది మరొక లెక్క అనేలా ఉంది. ప్రస్తుతం పుష్ప సినిమాకు రెండు పార్టులకు కలిపి 70కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్ అయితే వస్తోంది. అంటే ఒక్క సినిమాకు 35 కోట్లు. ఇక ఐకాన్ సినిమాతో పాటు ఏఆర్.మురగదాస్, బోయపాటి శ్రీను తో కూడా సినిమాలు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ సినిమాపై ఇదివరకే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక పుష్ప 1 నుంచి చూసుకుంటే బన్నీ లైనప్ లో 6 సినిమాలు ఉన్నాయి.
ఇక ఆ సినిమాలన్నింటికి ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం రెమ్యునరేషన్ తీసుకుంటే గనక మొత్తంగా 200కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకోవచ్చని టాక్ అయితే వస్తోంది. ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన మొదటి సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేయాలని సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!