అనిల్ రావిపూడి ఆ హీరోతో ఫిక్స్?

అపజయమెరుగని దర్శకుల లిస్టు లో .. రాజమౌళి, కొరటాల శివ తరువాత అనిల్ రావిపూడి కూడా చేరిన సంగతి తెలిసిందే. మొదటి నాలుగు సినిమాలను మీడియం రేంజ్ హీరోలతో తెరకెక్కించిన అనిల్ రావిపూడి.. తన 5వ చిత్రాన్ని మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఈ ఏడాది విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. మహేష్ కే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి.. ఇక అనిల్ కు వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేసే అవకాశం దక్కుతుంది అని అంతా అనుకున్నారు.

‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ పూర్తి చేసిన తరువాత స్టార్ హీరోతో సినిమా చెయ్యాలి అనుకున్నాడు అనిల్. కానీ కరోనా వచ్చి అతని ప్లాన్స్ పై నీళ్ళు జల్లిందనే చెప్పాలి. ‘ఎఫ్3’ ఎలాగూ మొదలు పెట్టే ఛాన్స్ లేదు. వెంకీ ‘నారప్ప’ తో బిజీ.. ఇక వరుణ్ ‘బాక్సర్'(వర్కింగ్ టైటిల్) తో బిజీ.ఇక మీడియం రేంజ్ హీరోలు కూడా అందరూ బిజీ..! అయితే అఖిల్ మాత్రం డిసెంబర్ కు ఖాళీ అయ్యే అవకాశం ఉందట.బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రం పూర్తయ్యాక.. మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు అఖిల్.

దాంతో నిర్మాత దిల్ రాజు.. ‘అఖిల్ – అనిల్’ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో పడినట్టు తెలుస్తుంది. అనిల్ రావిపూడి దగ్గర ఉన్న స్పోర్ట్స్ డ్రామాకు అఖిల్ అయితేనే సెట్ అవుతాడని అతనితో సంప్రదింపులు జరిపారట. అఖిల్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఒక్కసారి షూటింగ్ మొదలైతే 3 నెలల్లోనే సినిమా ఫినిష్ అయ్యేలా బౌండ్ స్క్రిప్ట్ అనిల్ దగ్గర రెడీ గా ఉందట.కాబట్టి అఖిల్ తో అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus