గోపీచంద్ డెసిషన్ కు షాకైన ప్రొడ్యూసర్..!

కెరీర్ ప్రారంభం నుండీ కాంట్రవర్సీ లకు దూరంగా ఉంటూ తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు హీరో గోపీచంద్. సోషల్ మీడియాలో కూడా ఇతని హడావిడి పెద్దగా ఉండదనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఇతని సినిమాలు ఏమాత్రం ఆడటం లేదు. మార్కెట్ కూడా చాలా వరకూ డల్ అయ్యింది. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ చిత్రం చేస్తున్నాడు గోపీచంద్. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు ‘హిప్పీ’ బ్యూటీ దిగంగన సూర్యవంశీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మణిశర్మ సంగీత దర్శకుడు. ఇదిలా ఉండగా… ‘సీటీమార్’ పూర్తయిన తరువాత నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ కు గోపీచంద్ ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఎలాగూ సినిమా చేసే అవకాశం లేదు. పైగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సినిమా పూర్తయిన వెంటనే… తన గురువు తేజ డైరెక్షన్లో ‘అలివేలు మంగ’ చిత్రం చెయ్యడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన గురువు తేజ ప్రాజెక్ట్ ను ఇబ్బంది పెట్టకుండా… బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ దగ్గర తీసుకున్న 2 కోట్ల పారితోషికాన్ని వెంటనే తిరిగి ఇచ్చేసాడట.

ఇక్కడ గోపీచంద్ ను 2 విషయాల్లో మెచ్చుకోవాలి. ఒకటి నిర్మాతని వెయిట్ చేయించకుండా తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేయడం. రెండవది తన గురువు తేజకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సినిమానే వదులుకోవడం. ఈ రెండు విషయాలను బట్టి గోపీచంద్ గ్రేట్ అనే చెప్పాలి.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus